TATA Group: త్వరలో ఈ కామర్స్ లో ఎంట్రీ..సూపర్ యాప్ ఆవిష్కరణ

దేశీయ వాణిజ్య దిగ్గజం టాటా గ్రూప్ ( Tata Group ). అందరికీ చిరపరిచితమైన పేరు. ఇప్పుడు సరికొత్తగా ఈ కామర్స్ ( E commerce ) రంగంలో అడుగు పెట్టబోతోంది. ఒకే ఒక్క సూపర్ యాప్. అన్ని రకాల కొనుగోళ్లకు ఇదే సమాధానం..టాటా ఆలోచన ఇదే ఇప్పుడు.

Last Updated : Aug 24, 2020, 07:59 PM IST
TATA Group: త్వరలో ఈ కామర్స్ లో ఎంట్రీ..సూపర్ యాప్ ఆవిష్కరణ

దేశీయ వాణిజ్య దిగ్గజం టాటా గ్రూప్ ( Tata Group ). అందరికీ చిరపరిచితమైన పేరు. ఇప్పుడు సరికొత్తగా ఈ కామర్స్ ( E commerce ) రంగంలో అడుగు పెట్టబోతోంది. ఒకే ఒక్క సూపర్ యాప్. అన్ని రకాల కొనుగోళ్లకు ఇదే సమాధానం..టాటా ఆలోచన ఇదే ఇప్పుడు.

టాటా గ్రూప్ అంటేనే నమ్మకానికి పేరుగా చెబుతారు. వ్యాపారంలోనే కాదు సేవా తత్పరతలో కూడా టాటా గ్రూప్ కు మంచి పేరుంది. పట్టిందన్నా బంగారమే ఈ సంస్థకు. ఇప్పుడు ఈ కామర్స్ విభాగంలో అడుగుపెట్టబోతోంది. దీనికోసం ఓ ప్రత్యేకమైన సూపర్ యాప్ ( Super app ) ను రూపొందిస్తోంది టాటా సంస్థ. ఈ యాప్  కోసం ఏకంగా 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతోంది. ఈ ఏడాది డిసెంబర్ లేదా జనవరి 2021 నాటికి ఈ సూపర్ యాప్ ( Super app by december 2020 or january 2021 ) ను ఆవిష్కరించడానికి సన్నహాలు చేస్తోంది. వినియోగదారుడికి కావల్సిన ప్రతి వస్తువును ఈ యాప్ తోనే ఆర్డర్ చేసేలా ఇది రూపొందించబడుతోంది. ఇప్పటికే ఫ్యాషన్ షాపింగ్ కోసం టాటా క్లిక్, కిరాణా కోసం క్విక్ ఆన్ లైన్, ఎలక్ట్రానిక్స్ కోసం క్రోమా ల ద్వారా టాటా సంస్థ సేవలందిస్తోంది. ఇప్పుడు ఈ అన్నింటినీ కలిపి..ప్రస్తుత వినియోగదారుల అవసరాల్ని తీర్చిదిద్దేవిధంగా...ఈ సూపర్ యాప్ వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అమెజాన్, రియయన్స్ ఇండస్ట్రీస్, ఫ్లిప్ కార్ట్ లకు పోటీగా ఇది రానుంది. Also read: Unlock 4: సెప్టెంబర్ 1 నుంచి మెట్రో సర్వీసులు ప్రారంభం?

Trending News