Tamilnadu Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం... ఆరుగురి మృతి, 10 మందికి గాయాలు

Tamilnadu Road Accident: తమిళనాడులోని చెంగల్‌పట్టులో లారీని బస్సు ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 10 మందికి గాయాలయ్యాయి.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 8, 2022, 02:44 PM IST
  • తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
  • చెంగల్‌పట్టులో లారీని ఢీకొట్టిన బస్సు
  • ప్రమాదంలో ఆరుగురు మృతి, 10 మందికి గాయాలు
 Tamilnadu Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం... ఆరుగురి మృతి, 10 మందికి గాయాలు

Tamilnadu Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రభుత్వ బస్సు స్టేషనరీ లోడ్‌తో వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 10 మంది గాయపడ్డారు. చెంగల్‌పట్టు జిల్లాలోని చెన్నై-తిరుచ్చి హైవేపై శుక్రవారం (జూలై 8) ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారు. చిదంబరం పట్టణానికి బయలుదేరిన ఈ బస్సు ఆచారపాక్కం సమీపంలో ప్రమాదానికి గురైంది. బస్సు డ్రైవర్.. ముందు వెళ్తున్న మరో బస్సును ఓవర్ టేక్ చేసే క్రమంలో నియంత్రణ కోల్పోయాడు. ఈ క్రమంలో స్టేషనరీ లోడ్‌తో వెళ్తున్న లారీని బస్సు ఢీకొట్టింది. 

ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను స్థానిక పోలీసులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తోంది. 

తమిళనాడులో రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం అందించే పథకాన్ని సీఎం ఎంకె స్టాలిన్ గతేడాది ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రమాదానికి గురైనవారికి ఈ పథకం ద్వారా మొదటి 48 గంటల్లో ఉచిత వైద్యం అందిస్తారు. బాధితులకు గోల్డెన్ అవర్‌లో చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు నిలిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే తమిళనాడు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.

Also Read: Sivaji Ganesan: శివాజీ కుటుంబంలో వివాదం.. ప్రభు, విక్రమ ప్రభుపై కోర్టు కేసు!

Also Read: Ra Ra Reddy: రారా రెడ్డి అంటూ కాక రేపుతున్న అంజలి..మాచర్ల నియోజకవర్గం సాంగ్ ప్రోమో

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News