Sasikala: తమిళ చిన్నమ్మ శశికళ విడుదల ఎప్పుడనేది మరోసారి చర్చనీయాంశమవుతోంది. ఆమె విడుదల రోజు భారీగా స్వాగత ఏర్పాట్లు చేసేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు (Tamil nadu Assembly Elections ) సమీపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ( Jayalalitha ) నెచ్చెలిగా రాష్ట్రంలో సుపరిచితమైన చిన్నమ్మ అలియాస్ శశికళ ఎప్పుడు విడుదలవుతారా అనేది ఆసక్తిగా మారింది. శశికళ విడుదల కాగానే..తమిళనాట రాజకీయాలు వేడెక్కడం ఖాయం. శశికళ విడుదలై బయటకు వస్తే..జరిగే రాజకీయ పరిణామాలపై అధికారపార్టీ ఏఐఏడీఎంకే ( AIADMK ) ముఖ్య నేతలకు ఆందోళనగా ఉంది.
జనవరి 27న జైలు జీవితం నుంచి చిన్నమ్మ శశికళ ( Chinnamma Sasikala ) బయటకు రావడం ఖాయమనే వార్తలు విన్పిస్తున్నాయి. అందుకే ఆమెకు భారీగా స్వాగతం పలికేందుకు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ( AMMK ) వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. అక్రమార్జన కేసులో జైళ్లో ఉన్న శశికళ శిక్షాకాలం ముగియనుంది. శిక్షాకాలం కంటే ముందుగానే విడుదలవుతారని తొలుత ప్రచారం జరిగినా..సాధ్యం కాలేదు. ముందస్తు విడుదల కోసం శశికళ చేసిన విజ్ఞప్తిని జైళ్లశాఖ పరిశీలనలో ఉంచింది.
అందుకే శిక్షాకాలం ముగియగానే జనవరి 27 న విడుదలవుతారని..ఇక ఏ మార్పు ఉండదని చిన్నమ్మ అభిమానులు భావిస్తున్నారు. చిన్నమ్మ రాక నేపధ్యంలోనే చెన్నైలోని కార్యాలయంలో ఆమె వర్గం సమావేశమైంది. జైలు నుంచి నేరుగా మెరీనా బీచ్ వద్ద ఉన్న జయలలిత సమాధికి చేరుకుని శపధం చేస్తారని అభిమానులు చెబుతున్నారు. ఆమె వచ్చే మార్గంలో 65 చోట్ల ఆహ్వాన ఏర్పాట్లు ( Welcome Arrangements ) చేస్తున్నారని తెలుస్తోంది.
Also read: New coronavirus strain: బ్రిటన్ కరోనా స్ట్రెయిన్ ప్రమాదకరం కాదు