Taj Mahal night viewing in moonlight: తాజ్ మహల్ నైట్ వ్యూయింగ్ డేట్స్, టైమింగ్స్

Taj Mahal night viewing in moonlight: కరోనావైరస్ మహమ్మారి కారణంగా 2020 మార్చి 17 నుంచి పర్యాటకులకు తాజ్ మహల్ వీక్షించేందుకు అనుమతి రద్దయిన సంగతి తెలిసిందే. అయితే, దేశంలో కరోనావైరస్ కేసులు (Coronavirus cases) అదుపులోకి వచ్చిన నేపథ్యంలో ఇటీవలే తిరిగి సందర్శకులకు స్వాగత ద్వారాలు తెరిచారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 20, 2021, 07:23 PM IST
Taj Mahal night viewing in moonlight: తాజ్ మహల్ నైట్ వ్యూయింగ్ డేట్స్, టైమింగ్స్

Taj Mahal night viewing in moonlight: తాజ్ మహల్ అందాలను పగటి పూట వీక్షించడం ఒక ఎత్తయితే.. నిండు పున్నమి వేళ చంద్రుడి వెలుగులో చూడటం మరో ఎత్తు. అందుకే పౌర్ణమి నాడు తాజ్ మహల్‌ని రాత్రి పూట చూసేందుకు సందర్శకులకు అనుమతిస్తారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా 2020 మార్చి 17 నుంచి పర్యాటకులకు తాజ్ మహల్ వీక్షించేందుకు అనుమతి రద్దయిన సంగతి తెలిసిందే. అయితే, దేశంలో కరోనావైరస్ కేసులు అదుపులోకి వచ్చిన నేపథ్యంలో ఇటీవలే తిరిగి సందర్శకులకు స్వాగత ద్వారాలు తెరిచారు. ఈ క్రమంలోనే తాజాగా రాత్రిపూట తాజ్ మహల్ వీక్షణకు అనుమతిస్తూ ఆగ్రా సర్కిల్ ఆర్కియాలజీ విభాగం ఉత్తర్వులు జారీచేసింది. 

ఆగస్టు 21వ తేదీ నుంచి తాజ్ మహల్‌ని రాత్రి పూట కూడా వీక్షించవచ్చు. ప్రస్తుతానికి ఆగస్టు 21, 23, 24 తేదీల్లో తాజ్ మహల్ నైట్ వ్యూయింగ్‌కి అనుమతి లభించినట్టు ఆగ్రా సర్కిల్ ఆర్కియాలజీ విభాగం సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ (Superintending Archaeologist) వసంత్ కుమార్ స్వర్ణాకర్ తెలిపారు. రాత్రి 9 గంటల నుంచి 9:30 గంటల వరకు ఒక స్లాట్, రాత్రి 9.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మరో స్లాట్, 10 గంటల నుంచి 10.30 గంటల వరకు మరో స్లాట్ అందుబాటులో ఉన్నట్టు వసంత్ కుమార్ వెల్లడించారు. 

Also read :  India Corona Updates: దేశంలో 36 వేల కొత్త కేసులు, 36 వేల రికవరీలు

ఎంత మందిని అనుమతిస్తారంటే..
సుప్రీం కోర్టు మార్గదర్శకాల (Supreme court) ప్రకారం ప్రతీ స్లాట్‌లో 50 మందిని మాత్రమే సందర్శనకు అనుమతించనున్నట్టు వసంత్ కుమార్ తెలిపారు.  

Taj Mahal night viewing ticket booking: టికెట్స్ ఎప్పుడు ఇస్తారు ?
తాజ్ మహల్ నైట్ వ్యూయింగ్‌కి ఒక్క రోజు ముందు మాత్రమే టికెట్ బుకింగ్ (Taj Mahal night viewing ticket booking) సదుపాయం ఉంటుంది.

Also read : Nithyananda Swamy: మధురై పీఠంపై కన్నేసిన నిత్యానంద, పీఠాధిపతిగా స్వయం ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News