Surat: చరిత్ర సృష్టించిన పోక్సో కోర్టు ..చిన్నారి హత్యాచార కేసులో 5 రోజుల్లోనే తీర్పు..

ఐదేళ్ల పాప హత్యాచార కేసులో 5 రోజుల్లోనే తీర్పు వెలువరించి..చరిత్ర సృష్టించింది సూరత్​లోని పోక్సో కోర్టు. నిందితుడికి యావజ్జీవ ఖారాగార శిక్ష ఖరారు చేసి రూ. లక్ష జరిమానా కూడా విధించింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 12, 2021, 01:53 PM IST
Surat: చరిత్ర సృష్టించిన పోక్సో కోర్టు ..చిన్నారి హత్యాచార కేసులో 5 రోజుల్లోనే తీర్పు..

Surat POSCO court: గుజరాత్‌(Gujarat)లోని సూరత్‌ నగరంలో ఐదేళ్ల పాపపై అత్యాచారం(Rape)జరిగింది. ఈ కేసు(rape case)లో విచారణను ఐదు రోజుల్లో పూర్తి చేసి..శిక్ష ఖరారు చేసి..చరిత్ర సృష్టించింది సూరత్(Surat) లోని ఒక పోక్సో కోర్టు. నగరంలోని సచిన్‌ జీఐడీసీ ప్రాంతంలో గత నెల 12న హనుమాన్‌ అలియాస్‌ అజయ్‌ మంగి నిషదె (39) అనే వ్యక్తి.. పళ్లరసం ఇస్తానంటూ ఓ పాపను పిలిచాడు. సమీపంలోని పారిశ్రామిక పార్కులోకి తీసుకువెళ్లి బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆపై గొంతు నులిమి హత్య చేశాడు.

Also Read: Crime News: రూ.2 వేల కోసం స్నేహితుడి హత్య

ఈ కేసులో పోక్సో కోర్టు(POSCO court) రాత్రి 11 గంటల వరకూ వాదనలు విన్నది. అజయ్‌కి అదనపు సెషన్స్‌ జడ్జి ప్రకాశ్‌ చంద్ర కాలా తాజాగా యావజ్జీవ కారాగార శిక్ష(life imprisonment) ఖరారు చేశారు. రూ.లక్ష జరిమానా కూడా విధించారు. సెలవులు తీసేస్తే సాంకేతికంగా 5 రోజుల్లోనే తీర్పు వచ్చినట్లవుతుందని జిల్లా చీఫ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నయన్‌ సుఖద్‌వాలా తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు అందినప్పటి నుంచి చూస్తే 30 రోజుల్లోనే శిక్ష ఖరారైందని పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News