Suicide Case: బలవంతంగా 'బీఫ్' తినిపించిన ప్రేయసి.. యువకుడి ఆత్మహత్య...

Gujarat Man Forced to Eat Beef Commits Suicide: తనకు ఇష్టం లేని మాంసాహారం బలవంతంగా తినిపించినందుకు ఓ వ్యక్తి తన ప్రాణాలే తీసుకున్నాడు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 30, 2022, 12:46 PM IST
  • సూరత్‌లో షాకింగ్ ఘటన
  • బలవంతంగా బీఫ్ తినిపించారని యువకుడి ఆత్మహత్య
  • సూసైడ్ నోట్‌లో వెల్లడించిన యువకుడు
Suicide Case: బలవంతంగా 'బీఫ్' తినిపించిన ప్రేయసి.. యువకుడి ఆత్మహత్య...

Gujarat Man Forced to Eat Beef Commits Suicide: బలవంతంగా ఎద్దు మాంసం తినిపించారనే కారణంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుజరాత్‌లోని సూరత్‌‌లో చోటు చేసుకుంది. ప్రేయసి, ఆమె సోదరుడు కలిసి బలవంతంగా ఎద్దు మాంసం తినిపించడంతో అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. జూన్ 27న చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మృతుడి తల్లి వీణా దేవీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం.. ఆమె కుమారుడు రోహిత్ సింగ్ ఓ ముస్లిం అమ్మాయిని ప్రేమించాడు. ఈ  విషయం తెలిసి ఇంట్లో వాళ్లు వ్యతిరేకించారు. ఒకవేళ ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇల్లు వదిలి పోవాలని చెప్పారు. దీంతో రోహిత్ సింగ్ తన ప్రేయసి కోసం ఇల్లు వదిలి వెళ్లాడు.

దాదాపు ఏడాదిన్నరగా రోహిత్ సింగ్, ఆమె ప్రేయసి కలిసే ఉంటున్నారు. ఇద్దరూ ఒకేచోట పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఏమైందో ఏమో తెలియదు కానీ జూన్ 27న రోహిత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు, తన ఫేస్‌బుక్ పేజీలో సూసైడ్ నోట్ పోస్ట్ చేశాడు. అందులో తన ప్రేయసి, ఆమె సోదరుడు తనకు బలవంతంగా ఎద్దు మాంసం తినిపించినట్లు రోహిత్ పేర్కొన్నాడు. తనను చిత్రహింసలకు గురిచేశారని చెప్పుకొచ్చాడు. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌లో తెలిపాడు. 

ఈ విషయం బంధువుల ద్వారా రోహిత్ కుటుంబ సభ్యులకు తెలిసింది. రోహిత్ తల్లి వీణా దేవి ఈ ఘటనపై సూరత్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. టెక్స్‌టైల్ మిల్లులో పనిచేసే రోహిత్‌కి అక్కడ పనిచేసే ఒకమ్మాయితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారినట్లు ఆమె తెలిపింది. రోహిత్ ఆమెను పెళ్లి చేసుకున్నాడో సహజీవనం చేస్తున్నాడో తనకు తెలియదని పేర్కొంది. తనకు కుమారుడి చావుకు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Also Read: Danish Kaneria on Kohli: విరాట్ సాధారణ ఆటగాడిగా కనిపిస్తున్నాడు.. కోహ్లీ ఆడింది గొప్ప ఇన్నింగ్స్‌ కాదు: పాక్ మాజీ ప్లేయర్

Also Read: Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్ లో సీబీఐ దూకుడు.. సిసోడియా బ్యాంక్ లాకర్లు ఓపెన్.. నెక్స్ట్ కవితేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x