న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాలు(Maharashtra politics) సస్పెన్స్ థ్రిల్లర్‌ని తలపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తీరును వ్యతిరేకించడంతోపాటు.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుకు ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారి సహకరించారని ఆరోపిస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఆదివారం విచారణ చేపట్టిన కోర్టు.. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కి దేవేంద్ర ఫడ్నవిస్ తనకి ఉన్న మెజారిటీని చూపిస్తు సమర్పించిన లేఖను, అదే విధంగా దేవేంద్ర ఫడ్నవిస్‌ని(Devendra Fadnavis) ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానిస్తూ గవర్నర్ రాసిన లేఖలను మరుసటి రోజైన సోమవారం(నవంబర్ 25) కోర్టులో సమర్పించాల్సిందిగా కోరుతూ తదుపరి విచారణను వాయిదా వేయడం జరిగింది. నిన్నటి ఆదివారం నాటి విచారణకు కొనసాగింపుగా నేడు సోమవారం తిరిగి విచారణ జరిపిన కోర్టు.. 24 గంటల్లోగా మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష జరపాలని ఆదేశించింది. బలనిరూపణ జరగాల్సింది అసెంబ్లీలో కానీ, గవర్నర్ వద్ద కాదని గుర్తుచేస్తూ... రాజ్‌భవన్ మెజారిటీని నిరూపించదని సుప్రీం కోర్టు(Supreme court) స్పష్టంచేసింది.
Read also : బీజేపీతో చేతులు కలపడంపై స్పందించిన అజిత్ పవార్
ఈ సందర్భంగా బల పరీక్షకు ఎక్కువ సమయం తీసుకుంటే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల సమస్య ఉత్పన్నమవుతుందని భావించిన కోర్టు.. 24 గంట్లలోగా బలపరీక్ష జరగాలని వ్యాఖ్యానించింది. అయితే, పలు సాంకేతిక కారణాల రీత్యా బలపరీక్షకు రెండు, మూడు రోజుల సమయం ఇవ్వాల్సిందిగా సొలిసిటర్ జనరల్ సుప్రీం కోర్టుకు విజ్ఞప్తిచేశారు. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం.. తీర్పును మంగళవారం ఉదయం 10.30 గంటలకు వెల్లడించనున్నట్టు తేల్చిచెప్పింది. దీంతో మహారాష్ట్రలో ఏయే పార్టీకి ఎంతెంత బలం ఉందో తెలియజేసే బల పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది.