వారణాసిలోని జ్ఞానవాపి మసీదు మళ్లీ వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం మసీదు ఉన్న ప్లేస్ లో గతంలో హిందూ దేవాలయం ఉంది అంటూ ఆనవాళ్లు లభించాయి అంటూ హిందూ సంఘాల వారు మసీదు ప్లేస్ లో పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేసిన విషయం తెల్సిందే. మొత్తం వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
గతంలో జ్ఞానవాపి మసీదు స్థలంలో హిందూ దేవాలయం ఉందా అనే విషయాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేస్తున్న విషయం తెల్సిందే. గత కొన్ని నెలలుగా సున్నిత ప్రాంతంలో ఈ సర్వేను అత్యంత భద్రత మధ్య నిర్వహిస్తున్నారు. తాజాగా మరో సారి ఈ విషయం వార్తల్లో నిలిచింది.
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో జులై 26వ తేదీ వరకు ఎలాంటి సర్వే నిర్వహించవద్దని సుప్రీం కోర్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించింది. వారణాసి కోర్టు సర్వే చేయాలి అంటే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సుప్రీం కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వడం జరిగింది. ముస్లిం పిటిషనర్ల వాదనల నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ స్టే ఇవ్వడం జరిగింది.
గత వారం వారణాసి కోర్టు శాస్త్రీయ సర్వే కోసం ఆదేశాలు ఇవ్వడంతో ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ సర్వేను ప్రారంభించింది. అయితే ఈ సర్వే నిర్ణయాన్ని ముస్లీం సంఘాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కోర్టుకు వెళ్లడంతో సుప్రీం కోర్టు రెండు రోజుల పాటు ఈ సర్వేను ఆపాలని స్టే విధించడం జరిగింది.
Also Read: YS Sharmila: ప్రజలకు చిప్ప చేతిలో పెడుతున్నడు.. సీఎం కేసీఆర్‌పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
వారణాసి కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలో జ్ఞానవాపి మసీదు ఉన్న విషయం తెల్సిందే. మొగల్ కాలంలో హిందూ దేవాలయంను కూల్చి వేసి మసీదు నిర్మించారు అంటూ హిందూ సంఘాలు ఆందోళన చేయడం మొదలైంది. దాంతో అక్కడ దేవాలయం ఉందా లేదా అనేది తెలుసుకునేందుకు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ సర్వేను మొదలు పెట్టింది.
ఇంతలో సుప్రీం కోర్టు స్టే విధించడం పట్ల హిందూ సంఘాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యం లో సర్వే కు స్టే వచ్చినా ముందు హిందూ దేవాలయం అక్కడ ఉందని నిరూపితం అవ్వబోతుంది అంటూ హిందూ సంఘాల వారు అంటున్నారు. మరో వైపు ముస్లీం మత పెద్దలు మాత్రం అక్కడ దేవాలయం లేదని బలంగా వాదిస్తున్నారు. ఈ కేసు చివరకు ఎక్కడికి చేరుకుంటుందో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Gnanavapi Masjid survey: జ్ఞానవాపి మసీదు సర్వేకి సుప్రీం స్టే