Supreme Court: కరోనా మహమ్మారి విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆమోదయోగ్యంగా ఉంటున్నాయి. వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలే అంతటా అమలయ్యే పరిస్థితి కన్పిస్తోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఇందుకు ఉదాహరణ..
కరోనా వైరస్ ప్రారంభమైనప్పటి నుంచి ఏపీ ప్రభుత్వం (Ap government) అందరికంటే ముందే ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. 2020లో కరోనాతో సహజీవనం చేయాలని చెప్పిన మాటల్నే అందరూ అనుసరించారు.వైరస్ కట్టడికి జోన్లుగా విభజించాలన్న సూచనలు అమలయ్యాయి. వ్యాక్సిన్ పేటెంట్ డీలైసెన్సింగ్ చేయాలన్న వైఎస్ జగన్ (Ys Jagan)ప్రతిపాదన అందరి నోటా వచ్చింది. తాజాగా కోవిడ్ కారణంగా అనాథలైన పిల్లల్ని ఆదుకోవాలనే ఏపీ ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు సుప్రీంకోర్టు వెలువరించింది. అనాధలైన పిల్లల పేరిట 10 లక్షల డిపాజిట్ చేసి..వచ్చే వడ్డీని నెల నెలా వారి ఖర్చులకు కేటాయిస్తూ..ఆ పిల్లలకు 25 ఏళ్లు వచ్చిన తరువాత డబ్బుల్ని విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించడం చేస్తోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఈ పధకాన్ని ప్రారంభించి అమలు చేస్తోంది.
ఇప్పుడీ ఆలోచనే సుప్రీంకోర్టు (Supreme Court)నోట వచ్చింది. కరోనాతో తల్లిదండ్రులిద్దరినీ లేదా తల్లి, తండ్రిని కోల్పోయిన చిన్నారుల వివరాలు నమోదు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించింది. కోవిడ్ లేదా ఇతర కారణాలతో అనాథలుగా మారిన చిన్నారులను గుర్తించి వారికి రాష్ట్రాలు తక్షణమే సాయం అందించాలంటూ సుమోటోగా స్వీకరించిన కేసుపై శుక్రవారం జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. కరోనా బారినపడి తల్లి, తండ్రి, లేదా ఇద్దరినీ కోల్పోయిన చిన్నారులు మహారాష్ట్రలో 2 వేల 9 వందల వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. మహమ్మారి బారినపడి దిక్కులేని వారిగా మారిన ఇటువంటి చిన్నారులు ఇంకా ఎందరు ఉన్నారో ఊహించలేం. మా ఉత్తర్వుల కోసం ఎదురుచూడకుండా.. ఆకలితో అలమటిస్తూ వీధుల్లో తిరిగే అటువంటి బాలలను తక్షణమే గుర్తించి, వారి బాధ్యతను యంత్రాంగం తీసుకోవాలంటూ ధర్మాసనం ఆదేశించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Supreme Court: వైఎస్ జగన్ నిర్ణయం..ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలుగా