ఢిల్లీ డెత్ మిస్టరీ; ప్చ్.. పిచ్చి మూఢ నమ్మకాలు నిండు ప్రాణాలు తీశాయ్ !!!

                                                             

Last Updated : Jul 2, 2018, 07:31 PM IST
ఢిల్లీ డెత్ మిస్టరీ; ప్చ్.. పిచ్చి మూఢ నమ్మకాలు నిండు ప్రాణాలు తీశాయ్ !!!

నమ్మకాలు ఉండొచ్చు కానీ.. పిచ్చి మూఢ నమ్మకం... అస్సలు ఉండకూడదు సుమా...అది ముదిరితే ఈ స్థాయిలో ఉంటుందో ఢిల్లీ సామూహిక ఆత్మహత్యల ఘటనే ఇందుకు నిదర్శనం. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్యులు చేసుకున్న ఈ కేసులో ఒళ్లుగగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమ మరణానికి కొద్ది క్షణాల ముందు వారు ఎలా గడిపారన్న దానిపై ఓ లేఖ పోలీసులకు చిక్కింది. లేఖలో పేర్కొన్న సూచనల ప్రకారం వీరంతా పలు నియమాలు పాటించినట్టు కనిపిస్తోంది. అవేంటో మనమూ తెలుసుకుందామా ....

* చనిపోయే వారం రోజులకు ముందే కర్మకాండలు నిర్వహించాలి...
* వారం రోజుల ఈ వ్యవధిలో ఎప్పుడు ఆత్మ ఆవహిస్తే ఆ మరుసటి రోజే పని పూర్తి చేయాలి.
* చనిపోవడానికి గురువారం లేదా శనివారాన్ని ఎంచుకోవాలి.
* తల చుట్టూ వస్త్రాన్ని గట్టిగా కట్టుకోవాలి... 
* చీర, దుపట్టాతో తాడుకేసి బిగించుకోవాలి
*  ఒకవేళ నిలబడలేని వృద్ధులు ఉంటే పక్క గదిలో పడుకోబెట్టవచ్చు.
* మసక వెలుతురు ఉపయోగించాలి
* చేతికి కట్టుకున్న గుడ్డ మిగిలితే ఆ గుడ్డముక్కను కళ్లకు కట్టుకోవాలి.
* నోటిని గుడ్డతో గట్టిగా కట్టేయాలి...
* ఎంత అంకిత భావంతో పనిచేస్తే అంత మంచి ఫలితం ఉంటుంది.
* అర్థరాత్రి 12 నుంచి 1 లోపు ఇది జరగాలి. దీనికంటే ముందు పూజలు చేయాలి.
* అందరి ఆలోచనలు ఒకేలా ఉంటేనే మంచి సరైన ఫలితం పొందుతారు..

సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న ఈ లేఖను బట్టి వీరంతా ముందుగా ప్లాన్ చేసుకున్న తర్వాతే బలవన్మరణాలకు పాల్పడినట్టు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు జరుగుతోంది. 

ప్చ్.. పిచ్చి మూఢ నమ్మకాలతో ప్రాణాలు పొగొట్టుకున్నారు. మనిషికి నమ్మకాలు ఉండచ్చుకానీ పిచ్చి నమ్మకాలు ఉండకూడదు సుమా. నమ్మకం అనేది జీవితంలో వెలుగు నింపాలే కానీ.. ఇలా శాశ్వతమైన అంధకారంలోకి నెట్టేయకూడదు.. ఈ ఘటనతోనైనా మేల్కొని ఇక నుంచైనా మూఢ నమ్మకాలకు స్వస్తి చెబుదాం..దాన్ని తరిమికొడదాం రండి..

Trending News