ఢిల్లీ: బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి పాకిస్తాన్ పై సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాక్ పీడ విరుగుడు కావాలంటే ఆ దేశాన్ని నాలుగు ముక్కులు చేయడమే శాశ్వత పరిష్కారమన్నారు. వాస్తవానికి బలూచ్ ప్రజలు పాకిస్థాన్ లో ఉండేందుకు ఇష్టపడటం లేదని... మరోవైపు సింధీలు, పష్తూన్లది కూడా ఇలాంటి అభిప్రాయంతోనే ఉన్నారని వ్యాఖ్యనించారు.
ఉగ్రమూకలకు అడ్డాగా పాక్
ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని పాక్ దేశాన్ని ను బలూచిస్థాన్, సింధ్, పష్తూన్ లతో పాటు అవశేష పశ్చిమ పంజాబ్ గా విడగొట్టాలని సూచించారు. ఇలా చేస్తే ఆ దేశ ప్రజలతో పాటు భారత దేశానికి ఎంతో మేలు కలుగుతుందని వ్యాఖ్యానించారు. అఖండ పాకిస్తాన్ లో ప్రస్తుతం సైన్యం, ఐఎస్ఐ, ఉగ్రవాదులే పాలిస్తున్నారని.. అదను చూసి దేశ విభజన చేస్తే ఉగ్రవాదుల చెర నుంచి పాకిస్తాన్ ప్రజలను రక్షించుకోవచ్చని..పైగా ఇది భారత్ కు దోహదపడుతుందన్నారు.
పాక్ ప్రధాని ఓ చప్రాసి...
పాక్ పాలకుడు, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను సుబ్రహ్మణ్యస్వామి ఓ ప్యూన్, చప్రాసి తో పోల్చారు. కొత్తగా ఎన్నికైన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేరుకే ప్రధానమంత్రి అని.. వాస్తవానికి పాకిస్థాన్ ను ప్రస్తుతం సైన్యం, ఐఎస్ఐ, ఉగ్రవాదులే పాలిస్తున్నారని విమర్శించారు. ప్రధాని హోదాలో ఉన్న ఇమ్రాన్ ఖాన్.. ఉగ్రవాదులు, సైన్యానికి ఒక సందర్భంలో ప్యూన్ లా..మరో సందర్భంలో చప్రాసిలా వ్యవహరిస్తున్నాడని సుబ్రమణ్యస్వామి ఎద్దేవ చేశారు.
పాక్ సమస్యకు ఫార్ములా చెప్పిన బీజేపీ నేత