Southwest Monsoon: దేశంలో విస్తరిస్తున్న నైరుతి రుతు పవనాలు..త్వరలో భారీ వర్షాలు..!

Southwest Monsoon: దేశంలో నైరుతి రుతు పవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. త్వరలో తెలుగు రాష్ట్రాలకు రానున్నాయి. వీటి ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.

Written by - Alla Swamy | Last Updated : Jun 11, 2022, 02:01 PM IST
  • విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు
  • ఇవాళ మరికొన్ని ప్రాంతాల్లోకి పవనాలు
  • త్వరలో తెలుగురాష్ట్రాల్లోకి రాక
Southwest Monsoon: దేశంలో విస్తరిస్తున్న నైరుతి రుతు పవనాలు..త్వరలో భారీ వర్షాలు..!

Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. ఇవాళ ఆరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, మహారాష్ట్ర, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాల్లోకి రుతు పవనాలు  ప్రవేశించాయి. రాగల 48 గంటల్లో మరింత విస్తరించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతు పవనాల కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇటు బంగాళాఖాతంలోనూ రుతు పవనాలు వేగంగా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రాగల రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

రాగల 48 గంటల్లో దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోకి రుతుపవనాలు రానున్నాయి. వీటి ప్రభావంతో వర్షాలు కురవనున్నాయి. ఏపీకి రుతు పవనాలు వస్తుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వారం రోజుల్లోనే ఏపీవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించనున్నాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు కార్వార్, చిక్‌మంగళూర్, బెంగళూర్, పుదుచ్చేరి ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు ఈశాన్య మధ్యప్రదేశ్‌ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి వ్యాపించింది.

దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. రానున్న రెండు,మూడు రోజుల్లో రుతు పవనాలు మరింత విస్తరించనున్నాయి. వీటి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. ఇవాళ, రేపు, ఎల్లుండి ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

అక్కడక్కడ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. నల్గొండ, ఖమ్మం,సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఈనెల ఆరంభంలోనే కేరళను రుతు పవనాలు తాకాయి. ఆ తర్వాత రుతు పవనాలు దేశవ్యాప్తంగా క్రమంగా విస్తరిస్తున్నాయి.

Also read: KCR NEW PARTY: కేసీఆర్ జాతీయ పార్టీ వెనుక జగన్? 

Also read:Revanth Reddy: వచ్చే ఎన్నికల్లో వాళ్లకే టికెట్లు... రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News