Corona Second Wave: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. భారీగా నమోదవుతున్న కేసులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపధ్యంలో సోనూ సూద్ మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. ఈసారి మెగా వ్యాక్సిన్ డ్రైవ్‌కు సిద్దమవుతున్నారు.
కరోనా వైరస్(Corona virus)కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక కొత్త కేసులు ఇండియాలోనే నమోదవుతున్నాయి. భారీగా పెరుగుతున్న కేసులు కలవరపెడుతున్నాయి. లాక్‌డౌన్ కాలంలో వలస కార్మికులను ఆదుకుని రియల్ హీరోగా నిలిచిన సోనూ సూద్( Sonu Sood)సెకండ్‌వేవ్ ( Corona second wave)లో పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు.కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు కీలక విజ్ఞప్తి చేశారు. 25 సంవత్సరాలు పైబడిన వారికి కూడా టీకాల ప్రక్రియ మొదలు పెట్టాలని కోరారు. ఎందుకంటే ఎక్కువగా 25 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసువారు, పిల్లలు కూడా వైరస్ బారిన పడుతున్నారని ఆయన తెలిపారు. పంజాబ్, అమృత్‌సర్‌లోని ఆసుపత్రిలో బుధవారం కోవిడ్-19 వ్యాక్సిన్‌ను తీసుకున్న సోనుసూద్ ( Sonu Sood) వ్యాక్సినేషన్‌పై అవగాహన పెంచేందుకు, టీకా తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించడానికి సంజీవని ఏ షాట్ ఆఫ్ లైఫ్ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అతిపెద్ద టీకా డ్రైవ్ మొదలవుతుందంటూ ఒక వీడియోను కూడా షేర్ చేశారు.
ఇండియాలో గత 24 గంటల్లో 1 లక్షా 26 వేల 789 కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కఠినమైన ఆంక్షలు విధించారు. ఢిల్లీ, పూణేల్లో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook