Sonia Assets: సోనియా గాంధీకి సొంత కారు లేదంట.. ఇక మిగతా ఆస్తిపాస్తుల లెక్కలు ఇవే..

Sonia Gandhi Election Affidavit: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తన ఆస్తిపాస్తుల వివరాలను వెల్లడించారు. రాజ్యసభ స్థానానికి పోటీ చేస్తుండడంతో ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో కీలక విషయాలు పంచుకున్నారు. ఆమె ఆస్తుల లెక్కలు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 16, 2024, 09:37 PM IST
Sonia Assets: సోనియా గాంధీకి సొంత కారు లేదంట.. ఇక మిగతా ఆస్తిపాస్తుల లెక్కలు ఇవే..

Sonia Gandhi Affidavit: కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన వ్యక్తిగత వివరాలు పంచుకున్నారు. ఆమె ఆస్తులు, ఆభరణాలు , కార్లు తదితర విషయాలను తన ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించారు. ఆమె ఆస్తుల విలువ అక్షరాలా రూ.12 కోట్లు ఉంది. అయితే ఆమెకు ఇప్పటివరకు సొంత కారు లేనే లేదంట. ఇన్నాళ్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న సోనియా గాంధీ తొలిసారి రాజ్యసభకు పోటీ పడుతున్నారు. ఈ సందర్భంగా నామినేషన్‌ వేసిన సోనియా గాంధీ తన ఆస్తులు, ఇతర వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Also Read: Organ Donor: సామాన్యులకు కూడా 'వీఐపీ' అంత్యక్రియలు.. రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

మొత్తం ఆస్తులు రూ.12.53 కోట్లుగా ప్రకటించారు. వీటిలో తన పుట్టింటి ఆస్తులు కూడా వెల్లడించడం విశేషం . ఇటలీలోని తండ్రి ఇంటి ఆస్తిలో వాటా విలువ రూ.27 లక్షలని తెలిపారు. ఆభరణాల విషయానికి వస్తే 88 కిలోల వెండి ఆభరణాలు, వస్తువులు ఉన్నాయని చెప్పగా.. 1,267 గ్రాముల బంగారం, ఆభరణాలు ఉన్నాయని సోనియా అఫిడవిట్ లో తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలోని డేరా మండి గ్రామంలో వ్యవసాయ భూమి ఉన్నట్లు వెల్లడించారు. ఎంపీ జీతం, రాయల్టీ ఆదాయం, మూలధన లాభాలు వంటివి తన ఆదాయ వనరులుగా పేర్కొన్నారు. ఇక తన చేతిలో రూ.90,000 నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా 2019 నాటి ఎన్నికల అఫిడవిట్‌లో పోలిస్తే ఈసారి ఆస్తుల విలువ తగ్గింది. ఆ ఎన్నికల సమయంలో ఆస్తుల విలువ రూ.11.82 కోట్లుగా ఆమె వెల్లడించారు.

Also Read: Elections Survey: దేశ ప్రజలకు PINEWZలో అద్భుత ఛాన్స్‌.. ఎన్నికలపై మీ అభిప్రాయం తెలిపే సదావకాశం

విద్యార్హతలు ఇలా ఉన్నాయి. అఫిడవిట్ ప్రకారం సోనియా గాంధీ 1964లో సియానాలోని ఇస్టిటుటో శాంటా థెరిసాలో ఇంగ్లీష్, ఫ్రెంచ్‌లో మూడు సంవత్సరాల విదేశీ భాషల కోర్సు పూర్తి చేశారు. 1965లో కేంబ్రిడ్జ్‌లోని లెనాక్స్ కుక్ స్కూల్‌లో ఇంగ్లీష్‌లో సర్టిఫికేట్ కోర్సు చదివినట్లు తెలిపారు. సోనియా గాంధీకి ఇప్పటివరకు సోషల్ మీడియా ఖాతా లేకపోవడం విశేషం. కాగా పదేళ్ల పాటు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కనుసైగలతో నడిపించిన సోనియాకు ఆస్తిపాస్తులు ఇంత తక్కువ ఉండడం విస్మయానికి గురి చేస్తున్నాయి. సోనియా ఆస్తులపై ప్రతిపక్ష పార్టీలు పలు సందేహాలు లేవనెత్తుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News