కాంగ్రెస్‌కు దగ్గరౌతున్న శివసేన ; ఇందిరగాంధీ సేవలపై ప్రశంసలు !

ఎన్టీయే మిత్రపక్షమైన శివసేన కాంగ్రెస్ కు దగ్గరౌతుందా అంటే తాజా పరిణామాలు చూస్తూంటే ఇది నిజమే అనిపిస్తోంది. నమ్మసక్యంగా లేదు కదూ  వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది.

Last Updated : Jul 2, 2018, 07:36 PM IST
కాంగ్రెస్‌కు దగ్గరౌతున్న శివసేన ; ఇందిరగాంధీ సేవలపై ప్రశంసలు !

ఎమర్సెనీ విధించడాన్ని తప్పుబడుతూ ఇందిగాంధీపై బీజేపీ విమర్శలు సంధిస్తున్న విషయం తెలిసిందే. ఎన్డీయే మిత్రపక్షమైన శిససేన అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఇందిరగాంధీ చేసిన సేవలను కొనియాడుతూ.. ఆమెపై బీజేపీ చేసిన ఈ విమర్శలను తప్పుబట్టింది..

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ కేవలం ఎమర్జెన్సీ విధించారనే కారణంతో ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను విస్మరించలేమని వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీని ఎత్తేసిన తర్వాత ప్రజాస్వామ్యంగానే ఆమె ఎన్నికలు నిర్వహించారనే విషయాన్ని విమర్శకులు గుర్తుంచుకోవాలని సూచించారు. దేశంలో ఇందిరాగాంధీ అంత గొప్పగా ఎవ్వరూ పనిచేయలేదని శివసేన ఎంపీ సంయజ్ రౌత్ కొనియాడారు. 

తాము ఎమర్జెన్సీ విధించడాన్ని సమర్ధించకపోయినప్పటికీ .. ఆ ఒక్క కారణం చూపుతూ ఇందిరా దేశానికి సేవలను మర్చిపోకూడదని వ్యాఖ్యానించారు. ఏ ప్రభుత్వమైనా అప్పటి పరిస్థితులను బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుందని.. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఇందిరాగాంధీ ఆ పని చేసి ఉంటారని పేర్కొన్నారు. ప్రస్తుతం యమర్జెన్సీ తప్పా..ఒప్పా అనేది ఆప్రస్తుతమని.. ముందు ఆ విషయాన్ని మర్చిపోయి ప్రస్తుత పరిస్థితులను ఎలా చక్క దిద్దాలనే అంశంపై దష్టి సారించాల్సి శివసేన పార్టీ పత్రిక సామ్నాలో రాసిన కథనంలో సంజయ్ రౌత్ పేర్కొన్నారు.

ఎమర్జెనీ కాదు.. నోట్ల రద్దు రోజు బ్లాక్ డే

ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన రోజును ‘బ్లాక్‌ డే’గా జరుపుకుంటున్న బీజేపీ... ముందు తమ ప్రభుత్వంలో ఎన్నో బ్లాక్‌ డేలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించుకోవాలని చురకలు అంటించారు. ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దు రోజును బ్లాక్ డే జరుపుకోవాల్సిన అవసరముందన్నారు. సామన్య జనానికి  ఆర్థికంగా ఇది చాలా ఇబ్బందులకు గురించేసిందన్నారు.

ఇప్పటి వరకు బీజేపీని వ్యతిరేకిస్తూ వచ్చిన శివసేన..మరికాస్త వేగం పెంచి కాంగ్రెస్ కు సమర్ధించే స్థాయికి చేరడం గమనార్హం. తాజా పరిణామాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో శివసేన కాంగ్రెస్ తో జతకట్టే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Trending News