Shashi Tharoor Memes: మహిళా ఎంపీతో ముచ్చట్లు.. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఎంపీపై ఫన్నీ మీమ్స్!

Shashi Tharoor Memes: పార్లమెంట్ లో గురువారం విచిత్రమైన సంఘటన ఒకటి జరిగింది. ఓ పక్క రష్యా - ఉక్రెయిన్ మధ్య జరుగుతోన్న యుద్ధం గురించి ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతున్న క్రమంలో కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశిథరూర్ మహిళా ఎంపీ నవ్వుతూ ముచ్చట్లు ఆడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న క్రమంలో శశిథరూర్ పై ట్రోల్స్ వస్తున్నాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 8, 2022, 11:32 AM IST
Shashi Tharoor Memes: మహిళా ఎంపీతో ముచ్చట్లు.. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఎంపీపై ఫన్నీ మీమ్స్!

Shashi Tharoor Memes: రాజకీయ నేతలు ఎక్కడున్నా.. వారు ఏం చేసినా కెమెరాలు రాజకీయ నాయకులపై ఫోకస్‌ పెడుతూనే ఉంటాయి. సభ జరుగుతుండగా పలువురు నేతలు నిద్రపోవడం.. ఇంకేదైనా చేయడం తరచు చూస్తుంటాం. తాజాగా కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ అలాంటి ఓ ఘటనతో సోషల్‌ మీడియా ట్రెండింగ్‌లో నిలిచారు. లోక్‌సభలో ఆయన ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేతో ముచ్చట పెట్టడమే ఇందుకు కారణం. దీనిపై సోష‌ల్‌ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ లోక్‌సభలో ఏం జరిగిందంటే.. రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధంపై సభలో జమ్మూ క‌శ్మీర్ మాజీ సీఎం ఫ‌రూక్ అబ్దుల్లా మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ ఎన్సీపీ ఎంపీ సుప్రియాసూలేతో ముచ్చటిస్తూ కనిపించారు. ముందు వరుస సీటులో ఆమె కూర్చొని ఉండగా.. శశిథరూర్‌ వెనుక సీట్‌లో బల్లపై తల ఆనించి పడుకుని నవ్వుతూ కాసేపు మాట్లాడారు. ఓ వైపు ఫరూక్‌ అబ్దుల్లా సీరియస్‌గా సభలో ప్రసంగిస్తుండగా శశిథరూర్‌ ఫన్నీగా ఆమెతో ముచ్చట పెట్టారు.

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు. ఫ‌ర్ర‌గో అబ్దుల్లా అనే వ్యక్తి తన ట్విట్టర్‌ అకౌంట్‌లో అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని శ్రీవ‌ల్లి పాట బీజీఎంతో శశిథరూర్‌ వీడియోను ఎడిట్ చేసి పోస్ట్‌ చేశారు. మరో నెటిజన్‌.. శశిథ‌రూర్ అంటే ఫైర్ కాదు.. ఫ్ల‌వ‌ర్ అంటూ ఫన్నీ కామెంట్‌ చేశాడు. 

Also Read: Woman Orders Wine Online: ఆన్‌లైన్‌లో వైన్ ఆర్డర్.. మహిళకు రూ. 4.80 లక్షల టోకరా

Also Read:Flight Insurance: ఇదో వింత సమస్య.. ఇన్సూరెన్స్ సమస్యతో ఆగిపోయిన ఫ్లైట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News