Rahul Gandhi Security Lapse: పంజాబ్​లో మరోసారి భద్రతా లోపం- ఈ సారి రాహుల్ గాంధీకి..

Rahul Gandhi Security Lapse: పంజాబ్​లో మరోసారి భద్రత లోపం వెలుగు చూసింది. ఓ వ్యక్తి రాహుల్ గాంధీ కారుపై జెండా విసిరాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 7, 2022, 03:19 PM IST
  • వీవీఐపీల భద్రతలో మరోసారి లోపం
  • రాహుల్​ గాంధీ కాన్వాయ్​పై జెండా విసిరిన యువకుడు
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
Rahul Gandhi Security Lapse: పంజాబ్​లో మరోసారి భద్రతా లోపం- ఈ సారి రాహుల్ గాంధీకి..

Rahul Gandhi Security Lapse: వీవీఐపీల సెక్యూరిటీలో మరోసారి భద్రతా లోపం వెలుగులోకి వచ్చింది. గత నెల ఆరంభంలో పంజాబ్​లో ప్రధాని మోదీ కాన్వాయ్​ను అడ్డుకున్న ఘటన మరవక ముందే.. మళ్లీ పంజాబ్​లోనే.. మరోసారి భద్రత లోపం బయటపడింది.

అయితే ఈ సారి భద్రతా లోపం ఘటన కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ కాన్వాయ్​కి ఎదురైంది.

ఇంతకీ ఏమైందంటే..

పంబాజ్ పర్యటనకు వెళ్లిన రాహుల్​ గాంధీ కారుపై ఓ యువకుడు జెండా విసిరాడు. అది కాస్త రాహుల్ గాంధీ ముఖానికి తగిలినట్లు తెలిసింది. ఈ ఘటనతో రాహుల్ గాంధీ కారు అద్ధం మూసేసి అక్కడి నుంచి మందుకు కదిలి వెళ్లారు.

ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన కోసం పర్యట..

పంజబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేందుకు ఆదివారం లుధియానా వెళ్లారు రాహుల్ గాంధీ. ఈ సమయంలో పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలకు అభివాదం చేసేందుకు రాహుల్ కారు అద్దం దించారు. సరిగ్గా ఇదే సమయంలో ఓ వ్యక్తి ఆయన ప్రయాణిస్తున్న కారుపై జెండా విసిరాడు. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన సందర్భంగా ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు మౌనం పాటించినట్లు సమాచారం.  

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం బయటకు వచ్చాయి. జెండా విసిన వ్యక్తి కశ్మీర్​కు చెందిన ఎన్​ఎస్​యూఐ కార్యర్తగా గుర్తించారు అధికారులు.

గత నెల 5న ప్రధాని మోదీ కాన్వాయ్​ను అడ్డగించి కొంత మంది నిరసన వ్యక్తం చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ విషయపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

ఇక ఇటీవలే యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఢిల్లీకి బయల్దేరి వస్తున్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్ధిన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిగిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఈ ఘటనలో నిందుతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also read: Punjab Elections: పంజాబ్ సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్​ ప్రకటన- మరోసారి చన్నీకే అవకాశం

Also read: Assembly Elections: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఎన్నికల సంఘం కీలక నిర్ణయం, ఆ సభలకు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News