Sabarimala Ayyappa Temple gets 52 crores Income only in 10 days: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ప్రస్తుతం భక్తులతో కిటకిటలాడుతోంది. మండల, మకరవిలక్కు పూజల కోసం నవంబర్ 16 నుంచి అయ్యప్పస్వామి దర్శనాలు ప్రారంభం కావడంతో.. భక్తులు పెద్దఎత్తున తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో శబరిమల అయ్యప్ప ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. గత పది రోజుల్లో ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 52.55 కోట్ల ఆదాయం సమకూరిందని దేవస్వమ్ బోర్డు అధ్యక్షుడు కే అనంతగోపన్ తెలిపారు. గతేడాది ఇదే సమయంలో కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో శబరిమల ఆలయానికి రూ. 9.92కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.
ఈ 10 రోజుల్లో శబరిమల అయ్యప్ప ఆలయానికి అత్యధికంగా అరవణ ప్రసాదం విక్రయంతో రూ. 23.57 కోట్లు వచ్చినట్టు దేవస్వమ్ బోర్డు అధ్యక్షుడు కే అనంతగోపన్ పేర్కొన్నారు. హుండీల ద్వారా రూ. 12.73 కోట్లు, అప్పం అమ్మకాల ద్వారా రూ. 2.58 కోట్లు వచ్చిందని ఆయన వెల్లడించారు. రానున్న 20 రోజుల్లో భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉందని అనంతగోపన్ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే 20 రోజులకు 51 లక్షల అరవణ ప్రసాదం డబ్బాలు సిద్ధం చేశామని తెలియజేశారు. రోజుకు సగటున రెండున్నర లక్షల డబ్బాల ప్రసాదాన్ని విక్రయిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.
'శబరిమల అయ్యప్ప ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. ఆదాయంలో మూడొంతులు ఉత్సవాల నిర్వహణకే వినియోగిస్తాం. మండకాలం ప్రారంభం నుంచి అయ్యప్ప దీక్షాపరులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాం. ఆన్‌లైన్, స్పాట్‌బుకింగ్‌ను సమర్థవంతంగా అమలు చేస్తున్నాము. సన్నిధానానికి వెళ్లేందుకు నాలుగు ద్వారాలను తెరిచాం. సన్నిధానం, పంపా, నిలక్కల్ వద్ద అంతరాయం లేకుండా రోజుకు మూడుసార్లు అన్నదానాలు చేస్తున్నాం. ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి అవసరమైన భక్తులకు వైద్య సహాయం చేస్తున్నాం' అని దేవస్వమ్ బోర్డు అధ్యక్షుడు చెప్పారు.
కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్ల నుంచి భక్తుల సంఖ్యపై పరిమితి విధించడంతో.. శబరిమల అయ్యప్ప ఆలయానికి ఆదాయం తగ్గిపోయింది. ఈ ఏడాది కరోనా ఆంక్షలు సడలించడంతో గతంలో ఎన్నడూ లేనంతగా భక్తులు పోటెత్తుతున్నారు. ఈ ఏడాది భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని ముందుగానే ఊహించిన ఆలయ అధికారులు అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆన్‌లైన్ ద్వారా ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. టైమ్ స్లాట్ విధానంతో భక్తులు ఎక్కువ సేపు నిరీక్షణ లేకుండా.. సన్నిధానంలోకి చేరుకుంటున్నారు.
Also Read: Man Tiger Mosquito Bite: దోమ కాటుతో కోమాలోకి.. 30 శస్త్రచికిత్సలు! బతికుండగానే నరకం
Also Read: Minister Roja: కబడ్డీ ఆడిన మంత్రి రోజా.. ఒక్కసారిగా మీదపడ్డ విద్యార్థులు! వైరల్ వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.