Russia Ukraine War Updates: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన నాటి నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భారత్ జోక్యం చేసుకోవాలని పలుమార్లు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. రష్యాతో భారత్‌కు ఉన్న స్నేహం రీత్యా పుతిన్‌తో మాట్లాడి యుద్ధాన్ని ఆపేలా చూడాలని జెలెన్‌స్కీ కోరారు. అయితే భారత్ మాత్రం ఆ విషయంలో తలదూర్చేందుకు పెద్దగా ఇష్టపడలేదు. ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్‌లో జరిగిన ఓటింగ్‌లోనూ తటస్థ వైఖరిని అవలంభించింది. ఇప్పటివరకూ ఈ విషయంలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోని భారత్.. మున్ముందు ఇరు దేశాల మధ్య శాంతి స్థాపనకు కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతిని నెలకొల్పే విషయంలో ఏవిధమైన సహకారం అందించేందుకైనా భారత్ సిద్ధంగా ఉందని తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శుక్రవారం (ఏప్రిల్ 1) రష్యా విదేశాంగ మంత్రి లావ్‌వోవ్‌తో దౌత్య చర్చల సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పీఎంవో కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది.
అంతకుముందు, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమైన లావ్‌రోవ్.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చల ప్రక్రియలో భారత్ మధ్యవర్తిగా వ్యవహరించవచ్చునని లావ్‌రోవ్ అన్నారు. సమస్యకు పరిష్కారం చూపించే పాత్రను భారత్ పోషించదలుచుకుంటే... అంతర్జాతీయ సమస్యల పట్ల న్యాయమైన, హేతుబద్దమైన దృక్పథంతో అటువంటి ప్రక్రియకు మద్దతునివ్వగలదు అని లావ్‌రోవ్ పేర్కొన్నారు. ఒకవేళ అమెరికా నుంచి భారత్‌పై ఒత్తిడి పెరిగితే అది రష్యాతో సంబంధాలపై ప్రభావం చూపిస్తుందా అన్న ప్రశ్నకు... భారత్-రష్యా సంబంధాలపై ఏ ఒత్తిడి ప్రభావం చూపించలేదన్నారు. భారత విదేశాంగ విధానం స్వతంత్రమైనదని.. అది నిజమైన జాతీయ ప్రయోజనాలపై దృష్టి సారిస్తుందని కొనియాడారు.
ఇక యుద్ధం గురించి ప్రస్తావిస్తూ.. 'మీరు దాన్ని యుద్ధం అంటున్నారు. కానీ మేము స్పెషల్ ఆపరేషన్ అంటున్నాం. ఉక్రెయిన్‌లోని మిలటరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మాత్రమే టార్గెట్ చేస్తున్నాం. ఉక్రెయిన్ నుంచి రష్యాకు ఎలాంటి ముప్పు లేకుండా చేసేందుకే ఈ ఆపరేషన్.' అని లావ్‌వోవ్ పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌పై గత నెల రోజులుగా రష్యా యుద్ధం చేస్తోన్న సంగతి తెలిసిందే. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ ఇప్పటికే కకావికలమైంది. ఇరువైపులా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ రష్యా యుద్ధం ఆపే సూచనలు కనిపించట్లేదు. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగినా అవేవీ ఫలితాన్నివ్వలేదు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిగా భారత్ వ్యవహరించవచ్చునని లావ్‌వోవ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
Also Read: King Cobra in Bathroom: స్నానాలగదిలో కింగ్ కోబ్రా ప్రత్యక్షం.. షాక్ లో ఇంటి యజమాని!
Also Read: Telangana Weather: తెలంగాణలో ఆ 6 జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook