Russia Ukraine Conflict: ఇండియాపై కూడా ఆ ప్రభావం.. ఇంధన ధరలు భారీగా పెరిగే ఛాన్స్!

Russia Ukraine Conflict effects Brent Crude Price: ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడం అంతర్జాతీయ ముడి చమురు ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2022, 07:01 PM IST
Russia Ukraine Conflict: ఇండియాపై కూడా ఆ ప్రభావం.. ఇంధన ధరలు భారీగా పెరిగే ఛాన్స్!

Russia Ukraine Conflict effects Brent Crude Price: ఉక్రెయిన్-రష్యా మధ్య ముదురుతున్న వివాదంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఆయిల్, గ్యాస్ ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఆయిల్ ఉత్పత్తిలో రష్యా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న నేపథ్యంలో.. ప్రస్తుత ఉద్రిక్తతలు ఆయిల్ సప్లైపై ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో మంగళవారం (ఫిబ్రవరి 22) నాటికి బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 100 డాలర్లకు చేరువైంది. 

'చమురు ధరలు మరోసారి పైకి ఎగబాకుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య చర్చలు అసంపూర్తిగా ముగియడంతో.. ఆయిల్ ధరలపై ప్రభావం పడింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ ప్లస్ (OPEC+) ప్రస్తుతం దాని కోటా ఆయిల్‌ను సప్లై చేసేందుకు స్ట్రగుల్ అవుతోంది.' అని ఎకనమిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ ప్రతినిధి ప్రతిభా థాకర్ పేర్కొన్నారు. 

చమురు ధరల సప్లైని పెంచడానికి ఒపెక్ ప్లస్ దేశాలు ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితాలు ఆశాజనకంగా కనిపించట్లేదు. ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన సమావేశంలో అంతర్జాతీయ మార్కెట్‌లోకి మరింత చమురును సప్లై చేసేందుకు వచ్చిన ప్రతిపాదనలు తిరస్కరించబడ్డాయి. ఈ పరిణామాలతో మున్ముందు క్రూడ్ ఆయిల్ ధర 100 డాలర్లు దాటే అవకాశం ఉందంటున్నారు. 

ఉక్రెయిన్-రష్యా పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలపై ప్రభావం చూపిస్తుండటంతో.. భారత్‌లోనూ దాని ప్రభావం పడనుంది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రిటైల్ ధరలను పెంచలేదని డెలాయిట్ భాగస్వామి దేబాసిష్ మిశ్రా పేర్కొన్నారు. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీ మార్కెట్‌లోనూ ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే నిత్యావసర ధరలు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. ఏదేమైనా ఆయిల్ ధరలు పెరగబోతున్నాయనే వార్తలు వాహనదారులకు షాకిస్తున్నాయి. 

Also Read: LPG Price Hike: సామాన్యులపై మరో భారం.. రెట్టింపు అవ్వనున్న గ్యాస్ సిలిండర్ ధర.. ఎప్పటినుండంటే..??

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News