న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో నేటికి 13 రోజులు కాగా, ఏప్రిల్ 14వ తేదీ దగ్గరపడుతున్న పరిస్థితుల్లో దేశవ్యాప్త లాక్‌డౌన్ ఎత్తివేస్తారా? లేదా కొనసాగిస్తారా? అనే చర్చ దేశవ్యాప్తంగా మొదలయ్యింది. ఒకవేళ ఎత్తివేస్తే పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై చర్చ కొనసాగుతోంది. దేశమంతటా ఒకేసారి లాక్‌డౌన్ ఎత్తివేస్తారా, లేకపోతే దశల వారీగా ఉంటుందా, ఏ రంగాలకు మినహాయింపు ఉంటుందని, మరికొన్ని రోజులు ఇదే పరిస్థితిని కొనసాగిస్తారా అన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనిపై ప్రభుత్వ వర్గాల నుంచి కూడా భిన్నమైన సమాచారం వస్తోంది. లాక్‌డౌన్ ఎత్తేసే విషయంపైనే ఏప్రిల్ 3న 16 మందితో కూడిన మంత్రుల బృందంలో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. దీనికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించగా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తదితరులు పాల్గొన్నారు.
Read Also: కేంద్రం లాక్ డౌన్ ఎత్తేసినా.. రాష్ట్రంలో నేను కొనసాగిస్తా: సీఎం కేసీఆర్
లాక్‌డౌన్ ఎత్తేసినప్పటికీ నిత్యావసర సరుకుల దుకాణాలు తెరిచే ఉంచాలని, అయితే ప్రజలు గుమిగూడటంపై మాత్రం నిషేధం కొనసాగించాలనే అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు. సినిమా థియేటర్లు, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, ప్రార్థనా మందిరాలను తెరవకూడదని నిబంధన విధించాలని భావించారు.
విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించాలని, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే విదేశీయులకు అనుమతులిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా చర్చ జరిగిందని, అయితే కరోనా వైరస్‌తో బాగా ప్రభావితమైన ప్రాంతాల్లో మాత్రం వారం వారం సంతలకు అనుమతి ఇవ్వకూడదని, రాష్ట్రమంతటా కోవిడ్ – 19 పై అవగాహన కల్పించేందుకు అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక అధికారులను నియమించాలని మంత్రివర్గ భేటీలో చర్చినట్టు తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..