Repuplic day celebrations 2022: గణతంత్ర దినోత్సవ(Republic Day) వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ (Delhi) సిద్ధమైంది. ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన రాజ్ పథ్ (Rajpath) మైదానంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కరోనా (Covid-19) ఆంక్షల మధ్య రిపబ్లిక్ డే వేడుకలు జరుపుతున్నారు. ఈ పరేడ్ లో భాగంగా..వివిధ శకటాల ప్రదర్శన ఉంటుంది. ఇది 1950 సంవత్సరం నుండి వార్షిక సంప్రదాయంగా కొనసాగుతోంది. అయితే 2022 సంవత్సరానికి సంబంధించి 21 శకటాలు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 12 శకటాలు వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవి కాగా, మిగిలిన 9 శకటాలు, కేంద్ర ప్రభుత్వ ఆజమాయిషిలో పనిచేసే విభాగాలు లేదా స్వతంత్ర సంస్థలకు చెందినవి.
మోదీకి దీదీ లేఖ
అయితే ఈసారి శకటాల ఎంపికకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన శకటాన్ని ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ నుంచి తిరస్కరించడమే అందుకు కారణం. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి (PM Modi) లేఖ రాశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన రిపబ్లిక్ డే పరేడ్ కు అనుమతించకపోవడం తమను కలిచి వేసిందంటూ దీదీ తన లేఖలో పేర్కొన్నారు.
Also Read: Republic Day 2022 : రిపబ్లిక్ డేకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇదిగో
రక్షణ శాఖ మార్గదర్శకాల ప్రకారమే ఎంపిక: రాజ్ నాథ్
కేంద్ర రక్షణశాఖ తిరస్కరించిన శకటాల్లో పశ్చిమ బెంగాల్ (West Bengal) శకటంతో పాటు శ్రీ నారాయణ గురును స్మరిస్తూ కేరళ ప్రభుత్వం రూపొందించిన శకటం తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన శకటాలున్నాయి. దీనిపై ఆయా రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. రక్షణ శాఖ మార్గదర్శకాల ప్రకారమే శకటాల ఎంపిక జరిగిందని ఆయన అన్నారు.
ఎలా ఎంపిక చేస్తారంటే..
గణతంత్ర వేడుకలకు బాధ్యత వహించే రక్షణ మంత్రిత్వ శాఖ.. ఏటా సెప్టెంబర్‌లో శకటాల ప్రదర్శనకు సంబంధించి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ విభాగాలు, కొన్ని రాజ్యాంగ సంస్థలకు లేఖలు రాస్తుంది. శకటాల డిజైనింగ్ లో పాటించాల్సిన మార్గదర్శకాలను రక్షణ మంత్రిత్వ శాఖ పంపిస్తుంది. పాల్గొనే సంస్థలు ప్రముఖ సంస్థలకు చెందిన అర్హులైన డిజైనర్లను తీసుకోవాలి. అలాగే చిత్రాలు లేదా కంటెంట్ చక్కగా కనిపించేలా ఉండేందుకు ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే వాల్, రోబొటిక్స్ లేదా మెకాట్రానిక్స్, కొన్నింటి కోసం 3D ప్రింటింగ్, వర్చువల్ రియాలిటీ, శకటాన్ని చక్కగా చూపేందుకు స్పెషల్ ఎఫెక్ట్స్ వంటివి పాటించాలి. ఇక దేశ వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా శకటాలు ఉండాలి కాబట్టి ఏ రెండు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు రూపొందించిన శకటాలు ఒకే తరహాలో ఉండకూడదన్న నియమం ఉంది. శకటాల రూపకల్పనలో పర్యావరణ అనుకూల వస్తువులు ఉపయోగించాలని, ప్లాస్టిక్, ప్లాస్టిక్ ఆధారిత వస్తువులను వాడకూడదనే సూచన కూడా అందులో ఉంటుంది.
Also Read: Republic Day Significance: జనవరి 26న రిపబ్లిక్ డేను ఎందుకు జరుపుకొంటారో తెలుసా?
నిపుణుల కమిటీ ఏర్పాటు
శకటాల ఎంపిక కోసం కళలు, సంస్కృతి, చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, ఆర్కిటెక్చర్, నాట్యం వంటి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ఒక ప్రత్యేక నిపుణుల కమిటీని రక్షణ మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేస్తుంది. వచ్చిన ప్రతిపాదనల నుంచి శకటాలను ఎంపిక చేయడంలో వీరు సలహాలు, సూచనలు అందిస్తారు. ఇక ప్రతిపాదనల పరిశీలన, తొలగింపు ప్రక్రియ పూర్తి చేసేందుకు నిపుణుల కమిటీ కనీసం ఆరుసార్లు సమావేశమవుతుంది. ఇక షార్ట్ లిస్ట్ అయిన వాటికి మాత్రమే తదుపరి రౌండుకు సంబంధించిన సమాచారం అందిస్తారు.
రిపబ్లిక్ డేలో పాల్గొనే వారికి రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ట్రాక్టర్, ఒక ట్రాయిలర్ అందిస్తుంది. వాటిపైనే శకటం ఏర్పాటుచేయాలి. శకటం థీమ్‌కు అనుగుణంగా ట్రాక్టర్‌ను అలంకరించాల్సి ఉంటుంది. అలాగే నడపడానికి, తిప్పడానికి వీలుగా ట్రాక్టరుకు, ట్రాయిలర్‌కు మధ్య ఆరు అడుగుల దూరం పాటించాలి. శకటాన్ని నిలిపి ఉంటే ట్రైలర్ 24 అడుగుల 8 ఇంచుల పొడవు, 8 అడుగుల వెడల్పు, 4.2 ఇంచుల ఎత్తుతో 10 టన్నుల బరువు మోయగలిగే సామర్థ్యంతో ఉండాలి. అలాగే శకటం పొడవు 45 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు, నేల నుంచి 16 అడుగుల ఎత్తు మించరాదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook