న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గురువారం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ఒకటి రెపో రేటు తగ్గింపు కాగా రెండోది రియల్-టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజిఎస్), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (ఎన్ఇఎఫ్టి) లావాదేవీలపై కనీస చార్జీలను రద్దు చేయడం. అవును, గురువారం భేటీ అయిన మానిటరీ పాలసీ కమిటి తీసుకున్న నిర్ణయం ప్రకారం బ్యాంకులు సైతం ఆర్టీజిఎస్, ఎన్ఇఎఫ్టి లావాదేవీలపై కనీస చార్జీలను ఎత్తివేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆర్టీజిఎస్, ఎన్ఇఎఫ్టి లావాదేవీలపై కనీస చార్జీలను ఆర్బీఐ రద్దు చేస్తున్నందున ఆ లబ్ధి ఫలాలను వినియోగదారులకు అందేలా బ్యాంకులు సైతం ఆ చార్జీలను ఎత్తివేయాల్సిందిగా ఆర్బీఐ తమ ప్రకటనలో పేర్కొంది.