ఇక భారత్ లో చైనా బ్యాంక్ ; లైసెన్సు జారీ చేసిన ఆర్బీఐ

Last Updated : Jul 5, 2018, 12:13 PM IST
ఇక భారత్ లో చైనా బ్యాంక్ ; లైసెన్సు జారీ చేసిన ఆర్బీఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లో తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు చైనా ప్రభుత్వ రంగ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ చైనాకు ఓకే అనేసింది. దీనికి సంబంధించిన లైసెన్లు కూడా జారీ చేసింది. ఇటీవల భారత ప్రధాని మోదీ చైనా వెళ్లిన సందర్భంలో  బ్యాంక్‌ ఆఫ్‌ చైనా ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా ఈ బ్యాంక్‌ కార్యకలాపాలు జరిపేందుకు అనుమతినిస్తామని మోదీ హామీ ఇచ్చారు. ప్రధాని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ మేరకు లైసెన్సు జారీ చేసింది. ఇప్పటికే భారత్ లో ఇండస్ట్రీయల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్ ఆఫ్‌ చైనా లిమిటెడ్‌ ఉంది.దీనికి తోడు దాదాపు 40 విదేశీ బ్యాంకులు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. 

Trending News