RBI Hikes Repo Rate: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. రెపో రేటుతో పాటు.. కీలక వడ్డీరేట్లను పెంచింది. దీంతో, నాలుగేళ్ల తర్వాత తొలిసారి వడ్డీరేట్లు పెరగనున్నాయి. ఈ పరిణామం రుణ గ్రహీతలకు భారం కానుంది. హౌసింగ్ లోన్లు తీసుకునే వాళ్లకు ఇది షాకింగ్ న్యూస్.
దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో ఆర్‌బీఐ అప్రమత్తమయ్యింది దిద్దుబాటు చర్యలు చేపట్టే పనిలోకి దిగింది. సామాన్యులపై ధరల భారాన్ని తగ్గించాలంటే ఈ నిర్ణయం తప్పదని భావించింది. చివరకు బుధవారం జరిగిన అత్యవసర సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. రెపోరేటుతో పాటు కీలక వడ్డీరేట్లను కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది. కరోనాకు ముందు అంటే.. 2018 ఆగస్టు తర్వాత రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచడం ఇదే మొదటిసారి.
ఆర్‌బీఐ 4౦ బేసిస్ పాయింట్లు పెంచడంతో రెపోరేటు 4.40 శాతానికి చేరుకుంది. పెంచిన రెపోరేటు వెంటనే అమల్లోకి వస్తుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. దీంతోపాటు.. క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్‌ఆర్)ను కూడా 50 బేస్ పాయింట్లు పెంచారు. ఈ పెంపుతో సీఆర్‌ఆర్ కూడా 4.50 శాతానికి చేరింది. అయితే సీఆర్‌ఆర్ మాత్రం మే 21వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.
దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు సర్దుబాటు ధోరణిని పక్కన బెట్టాలని నిర్ణయించినట్లు ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు. రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయికి చేరుతోందని, అందుకే ఆర్‌బీఐ అత్యవసరంగా సమావేశం కావాల్సి వచ్చిందని ఆయన ప్రకటించారు. వృద్ధిరేటు అవకాశాలను మెరుగుపర్చాలని లేదంటే కనీసం తటస్థంగా ఉంచాలన్న లక్ష్యం వల్లే రేట్లు పెంపు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే, కరోనా కాలంలో సంక్షోభ నివారణకోసం ప్రకటించిన ఉద్దీపనలను కూడా ఆచితూచి ఉపసంహరించే యోచనలో ఉన్నట్లు శక్తికాంతదాస్ తెలిపారు.
ఈ పరిణామాలు రుణగ్రహీతలకు ఊహించని షాక్ ఇచ్చాయి. కొన్నేళ్లుగా తక్కువ వడ్డీ రేట్లకే అప్పులు తీసుకున్న వాళ్లు ఇకపై ఈఎంఐ పెరగనుందన్న సంకేతాలతో ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే రుణాలు తీసుకున్న వాళ్లకు ఈఎంఐలు పెరగకున్నా.. కాలపరిమితి పెరిగే అవకాశం ఉంది. అయితే, కొత్తగా అప్పులు తీసుకునేవాళ్లకు మాత్రం ఈఎంఐ పెరగనుంది. ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను సవరించడంతో బ్యాంకులతో పాటు.. ఇతర ఆర్థిక సంస్థలు కూడా అనివార్యంగాఈ వడ్డీ రేట్లను పెంచనున్నాయి. ముఖ్యంగా హౌసింగ్ లోన్లు తీసుకునే వాళ్లకు ఈఎంఐ భారం కానుంది. అయితే, లోన్లు తీసుకోవాలనుకుంటున్న వాళ్లు.. ఇప్పటికిప్పుడే బ్యాంకులను సంప్రదిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి పెంచనున్న వడ్డీరేట్లపై ప్రకటన వెలువడకముందే ఈ పనిచేస్తే లాభమంటున్నారు.
అయితే, ఆర్‌బీఐ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసేవాళ్లకు మాత్రం లాభం చేకూరనుంది. ఎఫ్‌డీలపై వడ్డీ పెరగనుంది. ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకులు చాలా తక్కువ వడ్డీలు చెల్లిస్తున్నాయి. ఆర్‌బీఐ వడ్డీరేట్లను పెంచడంతో.. బ్యాంకులు కూడా ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంచనున్నాయి.
Also Read: నన్ను ఇస్లాంలోకి మారమని షాహిద్ అఫ్రిది ఒత్తిడి తెచ్చాడు: భారత స్పిన్నర్
Also Read: SVP Pre Release Event: మహేష్ బాబు 'సర్కారు వారి పాట' అప్‌డేట్... ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.