Ram mandir: అయోధ్యలో శ్రీరామ మందిరం కోసం విరాళాల సేకరణకు శ్రీకారం

Ram mandir: శతాబ్దాల సమస్యకు పరిష్కారం లభించాక..అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణం ప్రారంభమైంది. ప్రధాని చేతుల మీదుగా భూమిపూజ అనంతరం ఇప్పుడు మందిర నిర్మాణం కోసం విరాళాలు సేకరిస్తున్నారు.

Last Updated : Dec 15, 2020, 07:50 PM IST
Ram mandir: అయోధ్యలో శ్రీరామ మందిరం కోసం విరాళాల సేకరణకు శ్రీకారం

Ram mandir: శతాబ్దాల సమస్యకు పరిష్కారం లభించాక..అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణం ప్రారంభమైంది. ప్రధాని చేతుల మీదుగా భూమిపూజ అనంతరం ఇప్పుడు మందిర నిర్మాణం కోసం విరాళాలు సేకరిస్తున్నారు.

అయోధ్య ( Ayodhya ) లో వివాదాస్పద రామజన్మభూమి ( Ram janmabhoomi ) అంశానికి తెరపడింది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం శతాబ్దాల సమస్యకు పరిష్కారం లభించింది. వివాదాస్పద ప్రాంతంలో శ్రీరామమందిరం నిర్మించేందుకు మార్గం సుగమమైంది. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ ( pm narendra modi ) రామమందిర నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. రామ జన్మభూమి నిర్మాణం కోసం శ్రీరామ్ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ ఏర్పాటైంది. 

రామమందిర నిర్మాణం ( Ram mandir construction ) కోసం ఏర్పాటైన శ్రీరామ్ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్  మందిర నిర్మాణానికి సహయం అందించాల్సిందిగా కోరుతోంది. కోట్లాది రామభక్తులు రామ జన్మభూమి ( Ram janmabhoomi Trust ) కోసం ఏ విధంగా పోరాడారో..అదే విధంగా గుడి నిర్మాణానికి సాయం అందించాలని ట్రస్ట్ ట్వీట్ చేసింది. దేశవ్యాప్తంగా విరాళాల సేకరణ ఉంటుందని..ట్రస్ట్ తెలిపింది. సహాయం చేసినవారికి భారీ ప్రచారంతో పాటు కొత్త రామమందిరం ఫోటోను పంపిస్తామని ట్రస్ట్ పేర్కొంది. విరాళాల కోసం 10, 100, 1000 రూపాయల విరాళ కూపన్లు ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా 4 లక్షల గ్రామాల్లో విరాళాల సేకరణపై ప్రచారానికి ట్రస్ట్ సిద్ధమవుతోంది. 11 లక్షల కుటుంబాలకు చేరుకోవడం ద్వారా 55 కోట్లమందిని విరాళాల్లో భాగస్వామ్యం చేయాలనేది ట్రస్ట్ ఆలోచనగా ఉంది. Also read: AAP: యూపీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ: కేజ్రీవాల్ కీలక నిర్ణయం

Trending News