హైదరాబాదుకు రాజ్ నాథ్ సింగ్ రాక

Last Updated : Oct 30, 2017, 11:10 AM IST
హైదరాబాదుకు రాజ్ నాథ్ సింగ్ రాక

కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హైదరాబాదుకు వస్తున్నారు. సోమవారం శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ల పాసింగ్ ఔట్ పరేడ్ లో జరగనుంది. ఆయన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 69వ బ్యాచ్ కింద 136 మంది ఐపీఎస్ శిక్షణ పూర్తిచేసుకున్నారు.  

 రాయల్ భూటాన్ పోలీస్, నేపాల్ పోలీస్, మాల్దీవ్ పోలీస్ నుంచి 14 మంది విదేశీయుతోపాటు మొత్తం 136 ఐపిఎస్ ప్రొబేషనర్లు దీక్షన్ పెరేడ్లో పాల్గొంటారు. 22 మంది మహిళా ప్రొబేషనర్లలో ఒకరు భూటాన్ పోలీస్ నుంచి వచ్చినట్లు ఎస్వీపిఎన్పిఏ వెల్లడించింది.

" వివిధ పరిస్థితులను సమర్ధవంతంగా వ్యవహరించడానికి యువ అధికారులు రెడీగా ఉన్నారు. పూర్తిస్థాయి ఐపీఎస్ అధికారులుగా మారడానికి ముందు, సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్ అండ్ సిఏపిఎఫ్స్ ఆధ్వర్యంలో శిక్షణ పొందారు." అని ఎస్వీపిఎన్పిఏ డైరెక్టర్ డా. బర్మాన్ ఒక ప్రకటనలో తెలిపారు. 

బెస్ట్ ఆల్ రౌండ్ ఐపీఎస్ ప్రొబేషనర్ ప్రధాన మంత్రి బటాన్,హోం మంత్రిత్వ శాఖల రివాల్వర్ విజేత సమీర్ అస్లామ్ షేక్  నేతృత్వంలో ఈ పరేడ్ నిర్వహిస్తారు. అమ్రితా దుహాన్, ఉత్తమ ఆల్ రౌండ్ లేడీ ఏపీఎస్ ప్రొబేషనర్. 1973 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ట్రోఫి విజేత. ఆమె ఐదు సంవత్సరాల వయస్సు గల సమీర్ విజయ్ కు తల్లి. ఆమెకు ప్రేరణ  సోదరుడు వినోద్ దుహాన్, మణిపూర్ ఐపిఎస్ కేడర్.

Trending News