Rahul Gandhi Eviction Notice: ఎవిక్షన్ నోటీసుపై స్పందించిన రాహుల్, బంగ్లాతో నా జ్ఞాపకాలు పదిలమంటూ బావోద్వేగం

Rahul Gandhi Eviction Notice: ఎంపీ బంగ్లా ఖాళీ చేయాలన్న లోక్‌సభ ప్యానెల్ నోటీసులకు రాహుల్ గాంధీ హుందాగా స్పందించారు. లోక్‌సభ సెక్రటేరియట్‌కు లేఖ రాశారు. బంగ్లా ఖాళీ చేయాలనే నోటీసులకు కట్టుబడి ఉంటామని రాహుల్ బదులిచ్చారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 28, 2023, 03:23 PM IST
Rahul Gandhi Eviction Notice: ఎవిక్షన్ నోటీసుపై స్పందించిన రాహుల్, బంగ్లాతో నా జ్ఞాపకాలు పదిలమంటూ బావోద్వేగం

Rahul Gandhi Eviction Notice: మోదీ ఇంటి పేరుపై జరిగిన రచ్చ సూరత్ కోర్టు రాహుల్ గాంధీకు విధించిన జైలుశిక్ష వరకూ దారితీసింది. అనంతరం లోక్‌సభ సభ్యత్వాన్ని పార్లమెంట్ రద్దు చేసింది. ఎప్పుడైతే ఎంపీ సభ్యత్వం రద్దయిందో..వెనువెంటనే తుగ్లక్ లేన్ 12లో ఉన్న బంగ్లా ఖాళీ చేయాలంటూ ఎవిక్షన్ నోటీసు పంపింది లోక్‌సభ హోసింగ్ ప్యానెల్. 

ఒకదాని తరువాత ఒకటిగా ఎదురౌతున్న సమస్యల్ని, ఇబ్బందుల్ని రాహుల్ గాంధీ హుందాగా స్వీరిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని తుగ్లక్ లేన్ 12లో రాహుల్‌కు కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలంటూ లోక్‌సభ హౌసింగ్ ప్యానెల్ ఎవిక్షన్ నోటీసు పంపించింది. దీనికి రాహల్ గాంధీ చాలా హుందాగా స్పందించారు. లోక్‌సభ హోసింగ్ ప్యానెల్‌కు లేఖ రాశారు..

లేఖలో రాహుల్ ఏం రాశారంటే...

గత నాలుగు పర్యాయాలుగా లోక్‌సభకు ఎన్నికైన సభ్యుడిగా ప్రజలిచ్చిన తీర్పుతో ఇక్కడ ఉంటున్న నాకు ఈ భవనంతో చిరస్మరణీయ జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. నన్ను ఎన్నుకున్నందుకు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా హక్కులకు భంగం వాటిల్లకుండా లేఖలో పేర్కొన్న అంశాలకు కట్టుబడి ఉంటాను..అని రాహుల్ లేఖలో ప్రస్తావించారు. 

మరోవైపు రాహుల్ గాంధీని కించపరిచేలా చేస్తున్న వైఖరిపై కాంగ్రెస్ ఛీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. రాహుల్‌ని దెబ్బతీసేందుకు ఇలా చేస్తున్నారని, తన బంగ్లాను రాహుల్ వాడుకోవచ్చని ఖర్గే తెలిపారు. రాహుల్‌ని భయపెట్టి, బెదిరించడం, అవమానించడం సరైనంది కాదన్నారు. కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నా..రాహుల్ రాసిన లేఖ అతని నిబద్ధతకు, హుందాతనానికి నిదర్శనమని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు.

Also read: Rahul Gandhi Issue: జైలు శిక్ష..సభ్యత్వం రద్దు..ఇప్పుడు బంగ్లా ఖాళీ, రాహుల్‌ని వెంటాడుతున్న కష్టాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News