Rahul Gandhi Doctored Video Case: జీ న్యూస్ యాంకర్ రోహిత్ రంజన్‌కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. రాహుల్ గాంధీ వీడియో స్టేట్‌మెంట్ వక్రీకరణ కేసులో రోహిత్ రంజన్‌పై అధికారులు ఎటువంటి బలవంతపు చర్యలకు దిగవద్దని, కస్టడీలోకి తీసుకోవద్దని సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ ఇందిరా బెనర్జీ, జేకే మహేశ్వరిలతో కూడిన సుప్రీం బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వులతో రోహిత్ రంజన్‌కు బిగ్ రిలీఫ్ లభించినట్లయింది.
ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ వీడియో స్టేట్‌మెంట్‌ను రోహిత్ రంజన్ వక్రీకరించారనే ఆరోపణలు వచ్చాయి. కేరళలోని వయనాడ్‌లో తన కార్యాలయంపై ఎస్ఎఫ్ఐ దాడిని ఉద్దేశిస్తూ.. వాళ్లు చిన్నపిల్లలు అంటూ రాహుల్ కామెంట్స్ చేశారు. ఎస్ఎఫ్‌ఐ విద్యార్థి నేతలను ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలను రోహిత్ రంజన్ ఉదయ్‌పూర్ దర్జీ హత్య ఘటన నిందితులకు ముడిపెట్టారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై రోహిత్ రంజన్ వెంటనే విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పారు.
ఈ వ్యవహారానికి సంబంధించి రోహిత్ రంజన్‌పై ఛత్తీస్‌గఢ్‌లో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. దీంతో రోహిత్ రంజన్‌ని అరెస్ట్ చేసేందుకు ఈ నెల 5వ తేదీ తెల్లవారుజామున ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే ఛత్తీస్‌గఢ్ పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి యత్నించడాన్ని రోహిత్ వ్యతిరేకించారు. ఇదే వ్యవహారంపై ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తాను వక్రీకరించినట్లుగా చెబుతున్న రాహుల్ గాంధీ వీడియో థర్డ్ పార్టీ నుంచి సేకరించినదని పిటిషన్‌లో రోహిత్ రంజన్ పేర్కొన్నారు. తప్పు గ్రహించిన వెంటనే విచారం వ్యక్తం చేయడంతో పాటు క్షమాపణలు తెలియజేసినట్లు కోర్టుకు తెలిపారు. అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని చెప్పినప్పటికీ తనపై పలు కేసులు నమోదయ్యాయని అన్నారు. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ (రెగ్యులేషన్) యాక్ట్ 1995 ప్రకారం ఒకే ఘటనకు సంబంధించి ఒకటికి మించి ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయడానికి చట్టం అనుమతించదన్నారు. రోహిత్ రంజన్ తరుపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా కోర్టులో వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న సుప్రీం కోర్టు రోహిత్ రంజన్‌పై అధికారులు ఎటువంటి బలవంతపు చర్యలకు దిగవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: YSRCP Plenary Live Updates: వైసీపీ ప్లీనరీని ప్రారంభించిన సీఎం జగన్.. స్పెషల్ అట్రాక్షన్ గా విజయమ్మ
Also Read: Live Murder Video: నడిరోడ్డుపై అరాచకం.. కత్తులతో పొడిచి యువకుడి హత్య... వీడియో వైరల్
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook