Rahul Gandhi Assets: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తనకు రూ. 20 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఫామ్ లాండ్స్, బ్యాంక్ డిపాజిట్స్, షేర్లు అన్ని కలిపి రూ. 20 కోట్ల విలువ చేస్తుందని వాయనాడ్ నియోజకవర్గం ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వరుసగా రెండో సారి కేరళలోని వాయనాడ్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దిగుతున్నారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ రికార్డు మెజారిటీ గెలుపొందారు. అదే సమయంలో అమేఠీలో తన ప్రత్యర్ధి బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో దారుణంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే కదా. అందుకే ఈ సారి అమేఠీ స్థానం నుంచి కాకుండా.. కేవలం వాయనాడ్ నుంచే ఆయన ఎన్నికల బరిలో దిగడం విశేషం. అక్కడ గెలుపుకు అవకాశాలు లేవని సర్వేలు చెప్పడంతో ఆయన ఈ స్థానాన్ని ఎన్నుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈయన తెలంగాణలోని ఖమ్మం నుంచి కూడా పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్‌గా వయనాడ్‌నే ఎన్నుకున్నారు కాంగ్రెస్ అగ్రనేత. ఇక రాహుల్ గాంధీ తన చెల్లులు ప్రియాంక వాద్రాతో కలిసి ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ వయనాడ్‌లోని ఎన్నికల అధికారికి తన నామపత్రాలను అందజేసారు. అందులో తన ఆస్తులను రూ. 20 కోట్లు ఉన్నట్టు ప్రకటించాడు. రూ. 9.24 కోట్లు కార్లు ఇతర చరాస్తులు.. రూ. 11.14 కోట్ల వ్యవసాయ భూమి సహా స్థిరాస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు.
చరాస్తుల్లో రూ. 4.33 కోట్ల షేర్లు.. బాండ్స్ రూపంలో ఉన్నాయి. రూ. 3.81 కోట్ల మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినట్టు ఈ పత్రాల్లో. తన దగ్గర రూ. 26.25 లక్షల బ్యాంక్ డిపాజిట్స్.. రూ. 61.52 లక్షల నేషనల్ సేవింగ్స్ స్కీమ్, పోస్టల్ సేవింగ్స్.. జీవిత బీమా పాలసీలు ఉన్నట్టు పేర్కొన్నారు. అంతేకాదు రూ. 15.21 కోట్ల విలువైన బంగారం బాండ్లు.. రూ. 4.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు.. రూ. 55 వేల డబ్బు తన దగ్గర ఉన్నట్టు తన ఎన్నికల ప్రమాణ పత్రంలో పేర్కొన్నారు. ఇక 2022 -23లో తన సంవత్సర ఆదాయం దాదాపు రూ. కోటి ఉన్నట్టు ప్రకటించారు.
అంతేకాదు ఈయనకు దేశ రాజధాని దిల్లీలో మెహ్రౌలిలో వ్యవసాయ భూమి ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అందులో సిస్టర్ ప్రియాంక వాద్రాకు అందులో పార్టనర్ షిప్ ఉన్నట్టు వెల్లడించారు. అది తరతరాలుగా వారసత్వంగా దక్కిన ఆస్తి అంటూ అందులో పేర్కొన్నారు. అంతేకాదు హర్యాణలోని గురుగ్రామ్‌లో దాదాపు రూ. 9 కోట్ల విలువైన ఆఫీస్ స్పేస్ ఉన్నట్టు తెలిపారు. అంతేకాదు రూ. 49.7 లక్షల అప్పు ఉన్నట్టు తెలిపారు. తనపై భారతీయ జనతా పార్టీ నేతలు చేసిన పరువు నష్టం కేసులు.. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌తో లింక్ ఉన్న క్రిమినల్ కేసులు వంటి వివరాలను తన నామినేషన్ పత్రాల్లో తెలిపారు.
వయనాడ్ నుంచి రాహుల్ గాంధీపై సీపీఐ తరుపున అన్నీ రాజా అనే ఆమె పోటీ చేస్తున్నారు. అటు బీజేపీ తరుపున సురేంద్రన్ బరిలో ఉన్నారు. ఇక్కడ రెండో విడతలో భాగంగా ఈ నెల 26న అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు జూన్ 4న దేశ వ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియోజకవర్గాలకు కౌంటింగ్ నిర్వహించనున్నారు.
Also Read: Pawan Kalyan Fever: పవన్ కల్యాణ్‌కు అస్వస్థత.. యాత్రను వదిలేసి హుటాహుటిన హైదరాబాద్‌కు
Also Read: AP Pensions: ఏపీ ప్రజలకు భారీ షాక్.. ఇకపై ఇంటింటికి పథకాలు రావు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook