Punjab Congress Dispute: పంజాబ్ కాంగ్రెస్‌లో వర్గపోరు, పార్టీ ఛీఫ్ సిద్దూ హెచ్చరిక

Punjab Congress Dispute: పంజాబ్ అధికారపార్టీలో ఆధిపత్యపోరు అధికమౌతోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ వర్సెస్ పార్టీ ఛీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ వివాదం పెరిగి పెద్దదవుతోంది. ఇప్పుడు మరో వివాదం రేగింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 28, 2021, 03:24 PM IST
Punjab Congress Dispute: పంజాబ్ కాంగ్రెస్‌లో వర్గపోరు, పార్టీ ఛీఫ్ సిద్దూ హెచ్చరిక

Punjab Congress Dispute: పంజాబ్ అధికారపార్టీలో ఆధిపత్యపోరు అధికమౌతోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ వర్సెస్ పార్టీ ఛీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ వివాదం పెరిగి పెద్దదవుతోంది. ఇప్పుడు మరో వివాదం రేగింది.

పంజాబ్ కాంగ్రెస్‌లో(Punjab Congress)వర్గపోరు ఎక్కువవుతోంది. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్(Captain Amarinder Singh) నాయకత్వంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగనుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ హరీశ్ రావత్ స్పష్టం చేయడంతో పార్టీ ఛీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ నిరసన స్వరం పెంచారు. ఓ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోనివ్వాలని..లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని కాంగ్రెస్ అధిష్టానాన్ని సిద్ధూ తెలిపారు.

పార్టీలో కీలుబొమ్మలా, ఓ ప్రదర్శనకు ఉంచిన వస్తువులా ఉండదల్చుకోలేదని నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjyoth singh sidhu)తెలిపారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల అసమ్మతిని నియంత్రించేందుకు ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ బలప్రదర్శన చేశారు. చండీగఢ్‌లో క్రీడాశాఖ మంత్రి రాణా గుర్మీత్ సింగ్ ఇంట్లో విందు కార్యక్రమానికి 55 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు హాజరయ్యారు. ఇది విందు కార్యక్రమమైనా సరే..కచ్చితంగా బలప్రదర్శనేనని రాజకీయవర్గాలు భావిస్తున్నారు. పార్టీ నియమ నిబంధనలకు లోబడి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే హక్కు అధ్యక్షుడికి ఉందని కాంగ్రెస్ గతంలోనే ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా సిద్దూ గుర్తు చేశారు. నా నిర్ణయాలు తీసుకోనివ్వండని..మరో 20 ఏళ్లు అధికారంలో ఉండేలా చేస్తానని నవజ్యోత్ సింగ్ సిద్ధూ చెప్పారు. నిర్ణయాలు తీసుకునే అధికారం ఇవ్వకపోతే అందుకు తగ్గ పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని హెచ్చరించారు. 

Also read: India Corona Update: దేశంలో మరోసారి పెరుగుతున్న కరోనా ఉధృతి, రెండు నెలల గరిష్టానికి కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News