Punjab election result 2022: పంజాబ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాబావం ఎదురవుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జోరు ముందు కీలక నేతలు సైతం నిలవలేకపోతున్నారు. ఇప్పటికే పంజాబ్‌లో ఆప్ అధికార పగ్గాలు చేపట్టనుండటం దాదాపు ఖరారైంది. ఆరంభం నుంచే ఆప్ మ్యాజిక్ ఫిగర్కన్నా ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసింది.
ప్రముఖుల ఓటమి..
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు ఓటమిపాలయ్యారు. ప్రస్తుత సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ చమ్‌కౌర్ సాహిబ్, బదౌర్ స్థానాల నుంచి బరిలో దిగారు. రెండు చోట్లా ఆయనకు ఓటమి ఎదురైంది. మరో మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. రెండు స్థానాల్లో సైతం ఆప్ అభ్యర్థుల చేతిలోనే ఓటమిపాలయ్యారు చన్నీ.
బదౌర్ స్థానంలో ఆఫ్ అభ్యర్ఱథి లబ్ సింగ్ ఉగోకెకు మొత్తం 57 వేల ఓట్లు రాగా.. చన్నీకి 23 వేల ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇక చమ్‌కౌర్ ప్రాంతంలో మాత్రం చన్నీకి 50 వేల ఓట్లు వచ్చాయి. ఆప్ అభ్యర్థికి 54 వేల ఓట్లు రావడం గమనార్హం.
సిద్ధూ ఓటమి..
పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సిద్ధూ కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. అమృత్సర్ తూర్పు నుంచి బరిలో దిగారు సిద్ధూ.
ఇక పంజాబ్ కీలక నేతలు చాలా మంది ఓటమిపాలయ్యారు. శరోమణి అకాలీదల్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదలు, మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్‌లు కూడా ఎన్నికల్లో ఓటిపోయారు.
ఇక నటుడు సోనూ సూద్ సోదరి మాళవికా కూడా ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్‌కు కంచుకోట అయిన మోగా నుంచి అమె పోటీ చేశారు. అయితే ఆప్‌కు చెందిన సమీప అభ్యర్థి చేతిలో అమె ఓడిపోయారు.
సంబరాల్లో ఆప్..
ఢిల్లీ తర్వాత ఆప్ అధికారంలోకి రానున్న రాష్ట్రం పంజాబ్. దీనితో ఆప్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. పంజాబ్ ప్రజల తీర్పుపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ ఇప్పటికే ఆనందం వ్యక్తం చేశారు.
Also read: Pujab Polls Result 2022: పంజాబ్ ఎన్నికల్లో సోనూసూద్ సోదరి మాళవిక సూద్ ఓటమి
Also read: Uttarakhand Election Result 2022: ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్‌రావత్ ఓటమి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook