/telugu/photo-gallery/allu-konidela-family-dispute-over-allu-aravind-meets-to-pawan-kalyan-with-tollywood-producers-rv-145114 Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం 145114

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌‌పై ఉన్నట్టుండి కన్నడిగులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కావేరీ జలాల వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రజినీకాంత్ స్పందనకు నిరసనగా కొన్ని కన్నడ ప్రజా సంఘాల కార్యకర్తలు రామనగరలో శనివారంనాడు సూపర్ స్టార్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రజినికాంత్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కావేరీ జలాల పంపకాలపై సుప్రీంకోర్టు కర్ణాటకకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు తనను నిరుత్సాహపరిచిందని, తమిళనాడులోని రైతులపై ఈ తీర్పు తీవ్ర ప్రభావం చూపిస్తుందని రజినీకాంత్ శుక్రవారమే తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తీర్పుపై యావత్ తమిళులకు వున్న అసంతృప్తిని తన అభిప్రాయంతో తెలిపారు. అయితే, నటుడిగా ఎదగడం కన్నా ముందునుంచే కర్ణాటకతోనూ అనుబంధం కలిగి వున్న రజినీకాంత్ ఇప్పుడిలా కర్ణాటకకు వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంపై కన్నడ సంఘాలు మండిపడుతున్నాయి.

Section: 
English Title: 
Pro-Kannada organisations burns effigy of Rajinikanth in Bengaluru over his comments against Cauvery verdict
News Source: 
Home Title: 

రజినీకాంత్‌ని తాకిన 'కావేరి' సెగ !

సూపర్ స్టార్ రజినీకాంత్‌ని తాకిన 'కావేరి' సెగ !
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes