Pune Metro rail project: పుణె మెట్రో రైలు ప్రాజెక్ట్‌ ప్రారంభం.. మెట్రోలో ప్రయాణించిన ప్రధాని..

PM Modi in Pune: పుణె మెట్రో రైల్​ ప్రాజెక్టును ప్రధాని మోదీ ప్రారంభించారు.  టికెట్టు కొనుగోలు చేసి మరీ మెట్రోలో ప్రయాణించారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 6, 2022, 04:30 PM IST
  • పుణె మెట్రో రైల్​ ప్రాజెక్టుకు మోదీ శ్రీకారం
  • టికెట్‌ కొని ప్రయాణించిన మోదీ
  • ప్రాజెక్టు ఖర్చు రూ.11,400 కోట్లు
Pune Metro rail project: పుణె మెట్రో రైలు ప్రాజెక్ట్‌ ప్రారంభం.. మెట్రోలో ప్రయాణించిన ప్రధాని..

PM Modi inaugurates Metro Rail Project: పుణె మెట్రో రైల్​ ప్రాజెక్టును (Pune Metro rail project) ఆదివారం ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ మేరకు పుణె వాసులకు మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టులో భాగంగా.. మెుత్తంగా 32.2 కిలోమీటర్లు నిర్మించనున్నారు. అయితే ప్రస్తుతం 12 కిలోమీటర్ల మాత్రమే అందుబాటులోకి వచ్చింది.  అనంతరం ప్రధాని (PM Modi) కియోస్క్‌ ద్వారా  టికెట్టు కొనుగోలు చేసి గర్వేర్​ మెట్రో స్టేషన్​ నుంచి ఆనంద్​ నగర్​ వరకు మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా సందర్భంగా రైల్లో దివ్యాంగ చిన్నారులతో సంభాషించారు. అంతకుముందు లెహెగావూన్​ ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీకి.. మహారాష్ట్ర గవర్నర్​ భగత్​ సింగ్​ కోశ్యారీ, రాష్ట్ర మంత్రి సుభాష్​ దేశాయ్​, దేవేంద్ర ఫడణవీస్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్​ పాటిల్​ ఘన స్వాగతం పలికారు. 

అంతకుముందు మోదీ గర్వారే మెట్రో స్టేషన్‌లో (Garware Metro Station) ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఎగ్జిబిషన్‌ను తిలకించారు. 32.2 కిలోమీటర్ల మేర నిర్మించనున్న పుణె మెట్రో ప్రాజెక్టు కోసం మొత్తం రూ.11,400 కోట్లు వెచ్చించారు. ఈ ప్రాజెక్టుకు 2016 డిసెంబర్‌ 24న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మొత్తం 32.2 కిలోమీటర్ల దూరం కలిగిన మెట్రో రైల్వే నెట్‌వర్క్‌లో ప్రస్తుతం 12 కిలోమీటర్లు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే దూరంగా ఉన్నారు. అంతేకాకుండా పుణె మున్సిపల్​ కార్పొరేషన్​ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్​ విగ్రహాన్ని ఆవిష్కరించారు మోదీ. 

Also Read: Railway Tickets: రైలు ప్రయాణికులకు శుభవార్త.. టికెట్ కోసం ఇకపై క్యూ లైన్ అవసరం లేదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News