Cross Voting In Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. తద్వారా భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. తొలిసారి ఆ స్థానాన్ని అధిష్ఠించబోతున్న ఆదివాసీ బిడ్డగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. ద్రౌపది ముర్ము విజయం అంతా ఊహించినదే అయినప్పటికీ.. ఎన్డీయేకి వ్యతిరేకంగా జట్టు కట్టిన విపక్ష కూటమి నుంచి కూడా ముర్ముకు భారీగా ఓట్లు పోలవడం మాత్రం ఎవరూ ఊహించనిదే.
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష నేతలు భారీగా క్రాస్ ఓటింగ్‌కి పాల్పడ్డారు. విపక్ష కూటమికి చెందిన దాదాపు 17 మంది ఎంపీలు, 125 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారు. తమ పార్టీ లైన్‌ని ధిక్కరించి మరీ ద్రౌపది ముర్ముకు ఓటు వేశారు. పార్టీల లైన్ కన్నా ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేయాలనే ఉద్దేశమే వారిని క్రాస్ ఓటింగ్‌కి పాల్పడేలా చేసింది.
అత్యధికంగా అసోంలో 22 మంది ఎమ్మెల్యేలు, మధ్యప్రదేశ్‌లో 19 మంది ఎమ్మెల్యేలు, మహారాష్ట్రలో 16 మంది ఎమ్మెల్యేలు, గుజరాత్‌లో 10 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కి పాల్పడ్డారు. యశ్వంత్ సిన్హా తన సొంత రాష్ట్రమైన జార్ఖండ్ అసెంబ్లీలో 81 ఓట్లకు గాను కేవలం 4 ఓట్లు మాత్రమే పొందారు. అదే సమయంలో ద్రౌపది ముర్ము తన సొంత రాష్ట్రమైన ఒడిశాలో 147 ఎమ్మెల్యేలకు గాను 137 మంది ఎమ్మెల్యేల మద్దతు పొందారు.
రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ద్రౌపది ముర్మును బరిలోకి దింపి బీజేపీ రెండు విధాలుగా సక్సెస్ అయింది. తొలిసారి ఒక ఆదివాసీ మహిళను ఆ స్థానంలో కూర్చోబెట్టిన క్రెడిట్ దక్కించుకుంది. అదే సమయంలో విపక్షాల ఐక్యతను దెబ్బకొట్టింది. తొలిసారి ఒక ఆదివాసీ మహిళకు రాష్ట్రపతి అయ్యే అవకాశం రావడంతో విపక్ష పార్టీల్లో ఆ సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు పలువురు ఇతర ప్రజాప్రతినిధులు సైతం ముర్ముకే మద్దతుగా నిలిచారు. దీంతో బీజేపీ చాణక్యం ముందు విపక్షాలు బోల్తా పడ్డాయనే చెప్పాలి.
ఇలా రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష కూటమికి షాక్ తగిలిందో లేదో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరో బిగ్ షాకిచ్చింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు తాము దూరంగా ఉంటామని ప్రకటించింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరేట్ అల్వా అభ్యర్థిత్వం విషయంలో తమను సంప్రదించలేదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందే విపక్ష కూటమిలో చీలిక వచ్చినట్లయింది. మొత్తంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వ్యవహారం విపక్షాల ఐక్యత ఏపాటిదో చెప్పకనే చెప్పిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం ధర.. ఎంత తగ్గిందంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook