సుప్రీం కోర్టు ( Supreme Court ) సోమవారం ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు రూ.1 జరిమానా విధించింది. ఈ జరిమానాలను సెప్టెంబర్ 15వ తేదీలోపు కట్టాలి అని లేదంటే మూడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అని.. దాంతో పాటు మూడు సంవత్సరాలు లాయర్ గా ప్రాక్టిస్ నుంచి దూరం అవ్వాల్సి ఉంటుంది తెలిపింది.
కోర్టు ధిక్కారం కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. సర్వోన్నత న్యాయస్థానం గురించి, ఛీఫ్ జస్టిస్ ఎస్ ఏ బోబ్డే గురించి ప్రశాంత్ భూషణ్ ట్విట్టర్ లో వివాదాస్పదమైన కామంట్స్ చేయడంతో ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చర్యలు తీసుకున్నారు.
కోర్టు ధిక్కారంపై సుప్రీం కోర్డు విధించిన ఫైన్ ను కట్టడానికి ప్రశాంత్ భూషణ్ ( Prashant Bhushan ) అంగీకరించారు. గడువు తేదీ సెప్టెంబర్ 15కు ముందే జరిమానా చెల్లించడానికి సిద్ధం అయ్యారు. సుప్రీం కోర్టుకు రూపాయి జరిమానా చెల్లించేందుకు సిద్ధమైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు సీనియర్స్ న్యాయవాది రాజీవ్ ధవన్ ఒక్క రూపాయి అందించారు.
Prashat Bhushan: సుప్రీంకోర్టుకు జరిమానా చెల్లించేందుకు సిద్ధమైన ప్రశాంత్ భూషణ్