పోలింగ్ బూత్‌కి వెళ్లడానికి కొండల మధ్య 5 కిమీ నడిచిన సిబ్బంది

పోలింగ్ బూత్‌కి వెళ్లడానికి కొండల మధ్య 5 కిమీ నడిచిన సిబ్బంది

Last Updated : Apr 11, 2019, 01:28 AM IST
పోలింగ్ బూత్‌కి వెళ్లడానికి కొండల మధ్య 5 కిమీ నడిచిన సిబ్బంది

కోల్‌కతా: తొలి విడత లోక్ సభ ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోనూ రేపు(గురువారం) రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలింగ్ సిబ్బంది ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఇందులో భాగంగానే నేడు బుక్సా ఫోర్టుకు సమీపంలోని ఓ పోలింగ్ బూత్‌కు వెళ్లడం కోసం పోలింగ్ సిబ్బంది పడిన తిప్పలు అన్నిఇన్ని కావు. కొండల మధ్య ఎగుడుదిగుడు దారిలో 5 కిమీ పర్వతారోహణ చేస్తే కానీ అక్కడి వరకు చేరే పరిస్థితి లేదని పోలింగ్ సిబ్బంది వాపోయారు. 

బుక్సా ఫోర్ట్‌ వద్ద గ్రౌండ్ లెవల్‌కు 3000 అడుగుల ఎత్తులో వున్న పోలింగ్ బూత్‌కి పోలింగ్ సామాగ్రిని చేరవేయడం కోసం 22 మంది కూలీలు వారికి సహాయపడ్డారు. ప్రిసైడింగ్ ఆఫీసర్స్, పోలింగ్ సిబ్బంది, వారికి తోడుగా వెళ్లిన భద్రతా బలగాలు అందరికీ పర్వతారోహణ చేయకతప్పలేదు.

Trending News