Shiv Sena: శివసేనలో తీవ్రమవుతున్న ముసలం..తిరుగుబాటు జెండా ఎత్తిన ఎంపీలు..!

Shiv Sena: మహారాష్ట్రలో రాజకీయ వేడి తగ్గడం లేదు. శివసేనలో మరింత చీలిక వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియక ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే తల పట్టుకుంటున్నారు.

Written by - Alla Swamy | Last Updated : Jul 19, 2022, 04:19 PM IST
  • శివసేనలో తీవ్ర స్థాయిలో సంక్షోభం
  • మరింత తీవ్రమవుతున్న చీలిక
  • స్పీకర్‌ను కలవనున్న ఎంపీలు
Shiv Sena: శివసేనలో తీవ్రమవుతున్న ముసలం..తిరుగుబాటు జెండా ఎత్తిన ఎంపీలు..!

Shiv Sena: గతంలో ఎన్నడూ లేనివిధంగా శివసేనలో సంక్షోభం ముదురుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే అధికారాన్ని కోల్పోయారు. తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే..బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల సీఎంగా ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో సంక్షోభం ముగిసిందని అంతా భావించారు.

ఐతే శివసేనలో చీలిక మరింత తీవ్రమవుతోంది. తాజాగా పార్లమెంట్‌లోనూ ఆ పార్టీ చీలిక దిశగా వెళ్తోంది. లోక్‌సభలో ఆ పార్టీకి చెందిన 12 మంది ఎంపీలు ఠాక్రేపై తిరుగుబాటు చేశారు. షిండేలాగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరికి కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించడం చర్చనీయాంశంగా మారింది. శివసేనకు 19 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో చాలా మంది సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. 

వీరితో ఏక్‌నాథ్‌ షిండే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. తిరుగుబాటు ఎంపీలంతా కలిసి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ కానున్నారు. తమను ప్రత్యేక బృందంగా చూడాలని విన్నవించనున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే తిరుగుబాటు ఎంపీలకు వై కేటగిరి భద్రతను కేంద్ర ప్రభుత్వం కల్పించింది. 

దీనిపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. బీజేపీ అండగాతోనే ఎంపీలంతా ప్రత్యేక బృందంగా ఏర్పాటు కాబోతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎంపీల నివాసాల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. తిరుగుబాటు ఎంపీలను ప్రత్యేక గ్రూప్‌గా స్పీకర్ ఏర్పాటు చేస్తే..పార్టీ గుర్తు కోసం వారంతా ఎన్నికల సంఘానికి వెళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

Also read:TS EAMCET-2022: ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన..ఎంసెట్ అగ్రికల్చర్ రీషెడ్యూల్ ఇదే..!

Also read:CM Jagan: మరోసారి మాట నిలబెట్టుకున్న సీఎం జగన్..మిగిలిపోయిన లబ్ధిదారులకు నిధుల జమ..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News