POCSO Case: ఎన్నికల వేళ సంచలనం, మాజీ ముఖ్యమంత్రిపై పోక్సో కేసు నమోదు

POCSO Case: మాజీ ముఖ్యమంత్రిపై పోక్సో కేసు నమోదు కావడం ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. మైనర్ బాలికపై అత్యాచారం సంఘటనపై ఈ కేసు నమోదు కావడం హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 16, 2024, 05:52 AM IST
POCSO Case: ఎన్నికల వేళ సంచలనం, మాజీ ముఖ్యమంత్రిపై పోక్సో కేసు నమోదు

POCSO Case: బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి పై పోక్సో చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ 354 ఏ కింద కేసులు నమోదయ్యాయి. 17 ళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి ప్రయత్నించారనేది ప్రధాన ఆరోపణ. ఆ మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన రాజకీయంగా సంచలనం రేపుతోంది.

లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీకు పెద్ద సంకటమే ఏర్పడింది. కర్ణాటక బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై పోక్సో కేసు నమోదవడం సంచలనంగా మారింది. 17 ఏళ్ల బాలికపై 81 ఏళ్ల యడ్యూరప్ప అత్యాచారానికి ప్రయత్నించాడంటూ ఆ బాలిక తల్లి మొన్న రాత్రి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టంతో పాటు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 354 ఎ ప్రకారం కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 2వ తేదీన తల్లితో కలిసి యడ్యూరప్పను ఆయన నివాసంలో కలవడానికి వెళ్లినప్పుడు ఆ బాలిక తీసిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. డాలర్స్ కాలనీలోని యడ్యూరప్ప నివాసానికి వెళ్లిన పోలీసులు లిఖిత పూర్వకంగా వివరణ తీసుకున్నారు. తదుపరి దర్యాప్తు కోసం కేసును సీఐడీకు అప్పగించారు.

ఈ ఘటన కర్ణాటకలో రాజకీయంగా కలకలం రేపుతోంది. ఎన్నికల వేళ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేతపై లైంగిక ఆరోపణలు రావడం ఆ పార్టీకు సంకటంగా మారింది. ఈ ఘటనపై యడ్యూరప్ప స్పందించారు. తాను చట్టపరంగా ముందుకు వెళ్తానన్నారు. వాస్తవానిక్ ఆ మహిళ తన వద్దకూ ఏడుస్తూ రావడంతో లోపలకు పిలిచి సమస్య తెలుసుకున్నానని యడ్యూరప్ప తెలిపారు. వెంటనే పోలీస్ కమీషనర్ దయానందకు ఫోన్ చేసి ఆమెకు న్యాయం చేయాలని కోరానన్నారు. ఇప్పుడు తనపై నిందలు వేస్తోందని ఖండించారు. ఆ మహిళ కమీషనర్‌ను కలిసిన తరువాతే కేసు మలుపు తిరిగిందని యడ్యూరప్ప స్పష్టం చేశారు. 

ఈ ఘటనపై కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర సైతం మాట్లాడారు. కేసును ఎలాంటి పక్షపాతం లేకుండా దర్యాప్తు చేస్తామన్నారు. బాధితురాలి తల్లి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని కొందరు చెప్పినట్టు హోంమంత్రి చెప్పారు. 

Also read: Electoral Bonds: ఎలక్ట్రోరల్ బాండ్స్.. మరో సంచలన ఆదేశం ఇచ్చిన సుప్రీం ధర్మాసనం..

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News