PNB ఖాతాదారులకు అలెర్ట్, డిసెంబర్ 1 నుంచి ATM నియమాల్లో మార్పు!

NB ATM New Rules From December | మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వినియోగదారులు అయితే ఈ వార్త మీరు తప్పకుండా చదవాలి. ఎందుకంటే ఇది మీకు అత్యంత ప్రధానమైన వార్త.

Last Updated : Nov 28, 2020, 10:36 PM IST
    1. మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వినియోగదారులు అయితే ఈ వార్త మీరు తప్పకుండా చదవాలి.
    2. ఎందుకంటే ఇది మీకు అత్యంత ప్రధానమైన వార్త.
PNB ఖాతాదారులకు అలెర్ట్, డిసెంబర్ 1 నుంచి ATM నియమాల్లో మార్పు!

PNB New Rules | మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వినియోగదారులు అయితే ఈ వార్త మీరు తప్పకుండా చదవాలి. ఎందుకంటే ఇది మీకు అత్యంత ప్రధానమైన వార్త. 2020 డిసెంబర్ 1వ తేదీ నుంచి బ్యాంకు నుంచి క్యాష్ తీసుకునే విషయంలో కీలక మార్పులు చేయనున్నారు. ఈ సదుపాయం రావడం వల్ల బ్యాంకింగ్ మరింత సురక్షితంగా మారనుంది.

Also Read | Women Empowerment: మహిళలకు గ్యారంటీ లేకుండా పదిలక్షల రుణం ఇచ్చే బ్యాంకు ఇదే!

ఈ నియమంలో భాగంగా డిసెంబర్ 1 నుంచి ఇకపై మీరు రూ.10,000 కన్నా ఎక్కువ మొత్తం విత్ డ్రా చేస్తోంటే మీకు వెంటనే ఒక OTP వస్తుంది. అంటే ఇకపై మీఖాతా నుంచి డబ్బు బయటికి రావాలి అంటే తప్పకుండా మీ ఓటీపి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పెరుగుతున్న బ్యాంకింగ్ (Banking) మోసాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Also Read | WhatsApp OTP Scam | అంటే ఏంటి ? దీని నుంచి తప్పించుకోవడం ఎలా ?

పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) ప్రవేశపెట్టిన ఈ నియమం 2020 డిసెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఇది అమల్లో ఉంటుంది. ఈ సమయంలో గనక మీరు రూ.10,000 కన్నా ఎక్కువ మొత్తాన్ని ఏటీఎం (ATM) నుంచి తీసుకోవాలి అంటే ఓటీపి గురించి గుర్తుంచుకోవాలి. అంటే వినియోగదారులు తమతో పాటు ఫోన్ తప్పకుండా తీసుకెళ్లాలి.

పంజాబ్ నేషనల్ బ్యాంకులో, యునైటెడ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఒరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కార్స్ విలీనం అయిన విషయం తెలిసిందే. 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ విలీనం అమల్లోకి వచ్చింది.

Also Read | YES Bank : క్రెడిట్ కార్డు రివార్ట్ ప్రోగ్రామ్ మరింత లాభదాయకంగా మారనుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News