PM Narendramodi : ప్రధానికి ప్రత్యేక రాగంతో పేరు పెట్టిన గ్రామస్తులు

PM Appreciates Kongthong Villagers: మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు 60 కిలీమీటర్ల దూరంలో కింగ్‌థాంగ్‌ అనే ఊరు ఉంది. అక్కడ ఖాసీ తెగకు చెందిన ప్రజలకు పేర్లు ఉండవు. ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేకమైన రాగంతో పిలుస్తుంటారు. బిడ్డ పుట్టగానే తల్లిదండ్రులు ఒక రాగాన్ని సృష్టించి.. దానినే పేరుగా భావిస్తారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2021, 01:19 PM IST
  • ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం
  • ప్రధానికి ప్రత్యేక రాగంతో పేరు పెట్టిన కాంగ్‌థాంగ్‌ (విజ్లింగ్‌ విలేజ్‌) ప్రజలు
  • గ్రామం పర్యటకంగా అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తున్నందుకు ప్రధానికి గౌరవర్థంగా పేరు పెట్టినట్లు తెలిపిన మేఘాలయ సీఎం
PM Narendramodi : ప్రధానికి ప్రత్యేక రాగంతో పేరు పెట్టిన గ్రామస్తులు

PM Narendramodi Reply As Meghalaya Chief Minister Tweets Dedication From A Village: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం ఇచ్చారు ఆ గ్రామస్తులు. కాంగ్‌థాంగ్‌ (విజ్లింగ్‌ విలేజ్‌) (whistling village) ప్రజలు వారి సంప్రదాయం ప్రకారం.. ప్రధానికి ప్రత్యేక రాగంతో పేరు పెట్టారు. గ్రామం పర్యటకంగా అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తున్న ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) గౌరవర్థంగా ఈ పేరు పెట్టినట్లు మేఘాలయ సీఎం కె సంగ్మా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన పోస్ట్‌పై ప్రధాని మోదీ స్పందించారు. తనకు పేరు పెట్టినందుకు ఆ గ్రామ ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.

మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు (Shillong) 60 కిలీమీటర్ల దూరంలో కింగ్‌థాంగ్‌ (Kongthong) అనే ఊరు ఉంది. అక్కడ ఖాసీ తెగకు చెందిన ప్రజలకు పేర్లు ఉండవు. ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేకమైన రాగంతో పిలుస్తుంటారు. బిడ్డ పుట్టగానే తల్లిదండ్రులు ఒక రాగాన్ని సృష్టించి.. దానినే పేరుగా భావిస్తారు. 

Also Read : Newzealand MP: డెలివరీ కోసం స్వయంగా సైకిల్ తొక్కుతూ ఆసుపత్రికి వెళ్లిన మహిళా ఎంపీ

ఈ సంప్రదాయాన్ని కింగ్‌థాంగ్‌ గ్రామస్తులు వారి పూర్వీకుల కాలం నుంచి అలాగే పాటిస్తున్నారు. ఇక ఈ గ్రామాన్ని విజ్లింగ్‌ విలేజ్‌ (whistling village) అంటారు. ఎత్తైన కొండలోయల మధ్య ప్రకృతి ఒడిలో ఒదిగి ఉంటుంది కింగ్‌థాంగ్‌ (Kongthong) గ్రామం. ఈ ప్రకృతిని ఆస్వాదించడానికి.. ఇక్కడి ప్రజల సంప్రదాయాలను చూడడానికి.. రోజూ ఎందరో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ గ్రామం పర్యటకంగా ఎంతో అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ పర్యాటక సంస్థ నిర్వహించే పోటీకి కూడా మనదేశం తరఫున ఉత్తమ పర్యటక గ్రామంగా కింగ్‌థాంగ్‌ (విజ్లింగ్‌ విలేజ్‌) పేరును కేంద్ర ప్రభుత్వం నామినేట్‌ చేసింది. 

 

విజ్లింగ్‌ విలేజ్‌కు అంతర్జాతీయ స్థాయిలో (International level) పేరుప్రఖ్యాతలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న ప్రధాని మోదీకి కింగ్‌థాంగ్‌ గ్రామస్తులు ధన్యవాదాలు చెప్పాలనుకున్నారు. దీంతో ఒక ప్రత్యేకమైన రాగాన్ని సృష్టించి ప్రధానికి పేరు పెట్టారు. ఈ విషయాన్ని మేఘాలయ సీఎం (Meghalaya CM) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విభిన్నమైన రాగంతో పేరు పెట్టినందుకు కాంగ్‌థాంగ్ ప్రజలకు కృతజ్ఞతలు అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. మేఘాలయ పర్యాటక రంగం అభివృద్ధికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

Also Read : Radhe Shyam Love Anthem : ప్రభాస్ రాధేశ్యామ్ నుంచి అప్‌డేట్.. లవ్ ఆంథెమ్ సాంగ్‌ వచ్చేస్తోంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News