PM Narendra Modi Nomination - Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం 18వ లోక్ సభకు ఎన్నికల 7 విడతల్లో ఎన్నికలు జరగున్నాయి. ఇప్పటికే రెండు విడతలు ఎన్నికలు పూర్తయ్యాయి. మరో 5 విడతల్లో ఎన్నికల జరగనున్నాయి. మరోవైపు ప్రధాన మంత్రి పోటీ చేస్తోన్న వారణాసి సహా 57 లోక్ సభ నియోజకవర్గాలకు జూన్ 1న పోలింగ్ జరనుంది. ఈ నెల 14న వారణాసి లోక్ సభ స్థానానికి ఆయన నామినేషన్ దాకలు చేయనున్నారు. ఇప్పటికే ఆయన రెండు సార్లు ఈ నియోజవర్గం నుంచి భారీ మెజారిటీలో లోక్ సభలో అడుగుపెట్టారు. అంతకు ఒక రోజు ముందు ఆయన వారణాసిలో భారీ రోడ్ షో నిర్వహించనున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయం తర్వాత ప్రధాన మంత్రిగా తొలిసారిగా లోక్ సభకు ఎన్నికయ్యారు. ఇక 2019లో రెండోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2024లో ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు సాధిస్తే.. మూడోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. ఒకవేళ మూడోసారి నరేంద్ర మోదీ ఎన్నికైతే.. మూడోసారి పీఎం అయితే.. కాంగ్రెస్ యేతర తొలి ప్రధాన మంత్రిగా పలు రికార్డులు ప్రధాన మంత్రి మోదీ క్రియేట్ చేయనున్నారు.
ఏడు విడతల ఎన్నికల తర్వాత జూన్ 4న 543 లోక్ సభ స్థానాలకు ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తారు. అందులో ఎక్కువ సీట్లు ఎవరు గెలిస్తే వారే తదుపరి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటికే పలు సర్వే ఏజెన్సీలు మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే తిరిగి అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి.
ఇక్క కాంగ్రెస్ పార్టీ ఉత్తర ప్రదేశ్ అజయ్ రాయ్‌ను పోటీ చేస్తున్నాడు. 2014, 2019 సాధారణ ఎన్నికల్లో మోదీపై పోటీకి దిగిన అజయ్ ఓటమి పాలయ్యారు. అదే విధంగా రాజస్తాన్‌కు చెందిన కమెడియన్ శ్యామ్ రంగీలా కూడా వారణాసి నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు.
Also read: Uttam kumarreddy: బీఆర్ఎస్ పని ఖతం.. కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ఉత్తమ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook