Modi Htao Desh Bachao Posters: దేశ రాజధానిలో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ పలు పోస్టర్లు ప్రచురించడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ పోస్టర్లలో మోదీని తొలగించండి, దేశాన్ని రక్షించండి అని రాసి ఉంది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా అభ్యంతరకర పోస్టర్లు వేసిన ఈ కేసులో ఆరుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సోషల్ మీడియాలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు ప్రశ్నలు సంధించారు.
ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో మోదీ హఠావో దేశ్ బచావో నినాదంతో పలు పోస్టర్లు వెలిశాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం నుండి బయటకు వచ్చిన వ్యాన్‌లో ప్రధానికి వ్యతిరేకంగా చేసిన పోస్టర్లను ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం పోస్టర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆరుగురు వ్యక్తులు కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ పోస్టర్లకు సంబంధించి 100 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.
పోస్టర్లపై ప్రింటింగ్ ప్రెస్ వివరాలు లేవని స్పెషల్ సీపీ దీపేంద్ర పాఠక్ తెలిపారు. ఢిల్లీలో 50 వేల పోస్టర్లు వేసేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రధాని మోదీకి నిరసనగా పార్టీల నేతలు, కార్యకర్తలు ఈ పోస్టర్ వార్ ప్రారంభించారని తెలుస్తోంది. ఇక ఢిల్లీలోని పలు చోట్ల పోస్టర్లు అంటించినట్లు సమాచారం అందడంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు రోడ్డు పక్కన గోడలపై ఉన్న దాదాపు 2,000 పోస్టర్లను తొలగించారు.
ఇక ఈ అంశం మీద స్పెషల్ సీపీ దీపేంద్ర పాఠక్ మాట్లాడుతూ.. ఢిల్లీ పోలీసులు 100కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని, అయితే నగరవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా అభ్యంతరకర పోస్టర్లు వేసినందుకు ఆరుగురిని అరెస్టు చేశామని అన్నారు. ప్రింటింగ్ ప్రెస్ చట్టం, ఆస్తుల దుర్వినియోగం చట్టంలోని సెక్షన్ల కింద నగరవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Blast at Tamilnadu: పండుగ పూట పెను విషాదం.. ఎనిమిది మంది సజీవ దహనం?
Also Read: Earthquake Safety Tips: భూకంపం వస్తే ఈ పనులు చేయండి.. లేదంటే రిస్కే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook