Modi Special Gifts: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన బిజీగా కొనసాగుతోంది. క్వాడ్ దేశాల సమావేశం, ఐక్యరాజ్యసమితి సదస్సు నేపధ్యంలో..ప్రధాని మోదీ ప్రత్యేక బహుమతులు అందించారు. అవేంటో పరిశీలిద్దాం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) అమెరికా పర్యటన కొనసాగుతోంది. రెండవ రోజు పర్యాటనలో భాగంగా మోదీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో వైట్‌హౌస్‌లో భేటీ అయ్యారు. అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలతో కూడిన క్వాడ్ సదస్సులో పాల్గొన్నారు. సమావేశం అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ..అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు ప్రత్యేక బహుమతులు అందించారు. ఆమెతో పాటు ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులకు కూడా ప్రత్యేక బహుమతులిచ్చారు.
ప్రధాని మోదీ గులాబీ మీనాకారీ చెస్ సెట్‌ను కమలా హ్యారిస్‌కు(Kamala Harris)అందించారు. ఈ ప్రత్యేక చదరంగం సెట్‌లో ప్రతిభాగం అద్భుతంగా హస్తకళా నైపుణ్యంతో తయరైనదే. ఇందులోని ప్రకాశవంతమైన రంగులు కాశీ విశిష్టతను సూచిస్తాయి. గులాబీ మీనాకారీ ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాల్లో ఒకటైన కాశీకు సంబంధించినది. అంతేకాకుండా కమలా హ్యారిస్ తాత పీవీ గోపాలన్ హస్తకళకు సంబంధించిన పాత చెక్క జ్ఞాపికను ఆమెకు ప్రత్యేకంగా అందించారు. పీవీ గోపాలన్ గౌరవప్రదమైన సీనియర్ ప్రభుత్వ అధికారిగా పనిచేశారు. ఆయనకు సంబంధించిన నోటిఫికేషన్ల కాపీని కమలా హ్యారిస్‌కు మోదీ (Modi special Gifts)అందించారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌కు వెండి గులాబీ మీనాకారీ షిప్‌ను ప్రధాని మోదీ బహుమతిగా అందించారు. ఇది ప్రత్యేకంగా చేతితో తయారు చేసింది. అటు జపాన్ ప్రధానికి గంధపు బుద్ధ విగ్రహాన్ని బహుకరించారు. ఇండియా, జపాన్ మద్య సత్సంబంధాలు నెలకొల్పడంలో బౌద్ధమతం కీలకపాత్ర పోషించింది.
Also read: Kamala Harris: ఉగ్రవాద సమస్యలపై పాక్‌కు క్లాస్ పీకిన కమలా హ్యారిస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి