ప్రధాని నరేంద్ర మోడీ గురువారం గురేజ్ వ్యాలీతో పాటు జమ్మూ కాశ్మీర్ లైన్ ఆఫ్ కంట్రోల్ ఏరియాలో ఇండియన్ ఆర్మీ సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. దాదాపు రెండు గంటలు వారితో ముచ్చటించారు. వారికి తానే స్వయంగా మిఠాయిలు తినిపించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
భారత సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ "ఈ శుభదినాన అందరూ తమ కుటుంబంతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకుంటారు.. మీరే నా కుటుంబం.. అందుకే మీతో కలిసి వేడుకను జరుపుకోవడానికి వచ్చాను" అన్నారు. అలాగే రిటైర్ అయ్యే జవాన్లు తాము అనుకొంటే దేశానికి సేవ చేయవచ్చని, నేటి తరానికి వారు యోగా శిక్షకులుగా మారవచ్చని అభిప్రాయపడ్డారు.
ప్రధాని ఎల్‌ఓసీ ప్రాంతాన్ని సందర్శిస్తున్న సందర్భంలో ఆయన వెంట ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, తూర్పు కమాండర్ చీఫ్ జనరల్ దేవరాజ్ అన్బు, చినార్ కార్ప్స్ కమాండర్ లెఫ్టనెంట్ జనరల్ జేఎస్ సంధూ కూడా ఉన్నారు.
ప్రధాని తన అభిప్రాయలను పంచుకుంటూ, జవాన్లతో సమయాన్ని గడుపుతుంటే తనకూ నూతన ఉత్తేజం వస్తోందని అన్నారు. జవాన్ల త్యాగం, ఓర్పు, భయంకర వాతావరణంలో వారు చూపించే తెగువ అందరూ అభినందించవలసిన గుణాలను కొనియాడారు.
కేంద్ర ప్రభుత్వం సైనికుల పురోగతి కోసం, వారి కుటుంబాలకు చేయూతనివ్వడం కోసం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. అలాగే జవాన్ల కోసం ఎప్పటి నుండో పెండింగ్‌లో ఉన్న వన్ మ్యాన్ వన్ పెన్షన్ స్కీమ్‌ను సాధ్యమైనంత వరకు ప్రభుత్వం అమలుచేస్తుందని ప్రధాని తెలిపారు.
Addressing jawans, PM said he too wishes to spend #Diwali with his family. Therefore, he had come among jawans, whom he considers his family
— ANI (@ANI) October 19, 2017