PM Kisan Yojana 13th installment: రైతుల ఖాతాల్లోకి డిసెంబర్ 1 నుంచి మార్చి 31 మధ్య విడుదల కానున్న మూడవ విడత డబ్బు

PM Kisan Yojana 13th Installment: పీఎం కిసాన్ యోజనం పథకం దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో కేంద్రం ప్రభుత్వం విడతల వారీగా రూ.2 వేలు జమ చేస్తోంది. ఇప్పటివరకు 12 విడుతల్లో నగదు జమ చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2022, 11:18 AM IST
PM Kisan Yojana 13th installment: రైతుల ఖాతాల్లోకి డిసెంబర్ 1 నుంచి మార్చి 31 మధ్య విడుదల కానున్న మూడవ విడత డబ్బు

PM Kisan Yojana 13th Installment: పీఎం కిసాన్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకానికి సంబంధించి ప్రధాని మోదీ స్వయంగా అనేక వేదికలపై రైతుల సంక్షేమం గురించి మాట్లాడారు. ఈ పథకం అన్నదాతలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 'దేశం మన రైతు సోదర, సోదరీమణులను చూసి గర్విస్తోంది. అన్నదాతలు ఎంత ధృడంగా ఉంటే నవ భారతదేశం అంత సుసంపన్నం అవుతుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, వ్యవసాయానికి సంబంధించిన ఇతర పథకాలు దేశంలోని కోట్లాది మంది రైతులకు కొత్త బలాన్ని అందిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను..' అంటూ మోదీ ఇటీవల ట్వీట్ చేశారు. 

ఇప్పటికే రైతుల ఖాతాల్లో విడుతల వారీగా రూ.2 వేలు జమచేసింది. ఇటీవల 12వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయగా.. లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అయింది. ప్రతి ఏడాది ఈ పథకం కింద మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం నగదు జమ చేస్తుంది. 

ప్రస్తుతం ఈ పథకం 13వ విడతకు సంబంధించి అప్‌డేట్ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. మొదటి విడత ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు, రెండవ విడత ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు, మూడవ విడత డబ్బు డిసెంబర్ 1 నుంచి మార్చి 31 మధ్య లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. దీని ప్రకారం వచ్చే నెలలో రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ 13వ విడతకు సబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం ఉంది.

ముఖ్యమైన సూచనలు 

- అప్లికేషన్‌ను వెంటనే అప్‌డేట్ చేయండి
- ఈ పథకం కింద మీకు ఏదైనా సమస్య ఎదురైతే త్వరగా పరిష్కరించుకోండి.
- మీరు హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా మెయిల్ చేయడం ద్వారా పరిష్కారాన్ని పొందవచ్చు.
- పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్-155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092ను సంప్రదించవచ్చు. మీరు మీ ఫిర్యాదును
ఇ-మెయిల్ ID (pmkisan-ict@gov.in)లో కూడా మెయిల్ చేయవచ్చు.

మీరు ఇప్పటివరకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోకుంటే pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి నమోదు చేసుకోండి.

Also Read: Iran Police Fire: మెట్రో స్టేషన్‌లో కలకలం.. ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు  

Also Read: Garlic Benefits: చలి కాలంలో సీజనల్‌ వ్యాధులకు, చెడు కొలెస్ట్రాల్‌కు ఈ చక్కని చిట్కాతో చెక్‌...

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News