PM KISAN scheme: పీఎం కిసాన్ డిసెంబర్ ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు ఎప్పుడొస్తాయి ?

PM KISAN scheme December instalment amount: పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి ఈ ఏడాది డిసెంబర్ 1న రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన మూడో ఇన్‌స్టాల్‌మెంట్ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Last Updated : Dec 16, 2020, 09:11 PM IST
PM KISAN scheme: పీఎం కిసాన్ డిసెంబర్ ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు ఎప్పుడొస్తాయి ?

PM KISAN scheme December instalment amount: పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి ఈ ఏడాది డిసెంబర్ 1న రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన మూడో ఇన్‌స్టాల్‌మెంట్ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సాధారణంగా అయితే, ఏ నెలలో అయితే ఆ ఆర్థిక సహాయం రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంటుందో.. అదే నెలలో 1 నుంచి 15 తేదీలోగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. కానీ ఈసారి ఇప్పటికే 16వ తేదీ వచ్చినా డబ్బులు జమ కాలేదు. అంతేకాకుండా ఇంకొంత సమయం పట్టవచ్చనే వార్తలు కూడా వెలువడుతున్నాయి. ఉత్తరాదిన రైతుల ఆందోళన జరుగుతుండమే ఈ ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది.

2019లో ఫిబ్రవరి 24న పిఎం కిసాన్ యోజన ప్రారంభం అయింది మొదలు ఏడాదిలో ఏప్రిల్, ఆగస్టు, డిసెంబర్ నెలల్లో రైతుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ అవుతుండగా.. ఈ పథకం ప్రారంభం అయినప్పటి నుంచి ఒకే ఒక్కసారి ఇదే తరహాలో ఆలస్యమైంది. ఈసారి మూడో ఇన్‌స్టాల్‌మెంట్ ( PM KISAN scheme third instalment ) ఇంకా ఖాతాల్లో జమ కాకపోవడంపై కేంద్ర వ్యవసాయ శాఖ అధికారి ఒకరు స్పందిస్తూ.. రైతుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసేందుకు సర్వం సిద్ధమైందని, కేంద్రం నుంచి ఆదేశాలు వెలువడటమే తరువాయి డబ్బులు ఖాతాల్లో పడతాయని అన్నారు. 

Also read : SBI alert: ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు హెచ్చరిక.. అప్రమత్తం కాకుంటే అంతే సంగతి!

గతేడాది డిసెంబర్‌లోనూ ఇలాగే ఒక నెల ఆలస్యం కాగా.. ఆ తర్వాత బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ ( PM Modi ) పాల్గొన్న సందర్భంగా ఆ నిధిని ఒకే విడతలో 60 మిలియన్స్ మంది ఖాతాలో జమ చేసిన విషయాన్ని సదరు అధికారి గుర్తుచేసుకున్నారు. 

పిఎం కిసాన్ పథకం ( PM KISAN scheme ) కింద అర్హులైన రైతుల ఖాతాల్లో కేంద్రం ప్రతీ ఏడాది మూడు విడతల్లో ఒక్కో విడతకు రూ.2000 చొప్పున మొత్తం రూ.6000 జమ చేస్తున్న సంగతి తెలిసిందే.

Also read : How to apply for MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News