PM Kisan KYC Update Online 2022: పీఎం కిసాన్ యోజన పథకం లబ్ధిదారులు అలర్ట్. డిసెంబర్ 31వ తేదీలోపు ఈకేవైసీ చేయించుకోని వారు వెంటనే చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. పీఎం కిసాన్ స్కీమ్ లబ్ధిదారులకు ఈకేవైసీ వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేశామని.. ఈ పథకం కింద అన్ని ప్రయోజనాలను పొందేందుకు అర్హులవుతారని పేర్కొంది. ఈకేవైసీ వెరిఫికేషన్ లేని పక్షంలో లబ్ధిదారులకు వచ్చే విడత డబ్బులు జమ కావని స్పష్టం చేసింది.
ఇందుకోసం లబ్ధిదారులు మీ సేవా కేంద్రానికి వెళ్లి ఆధార్ కార్డు ద్వారా బయోమెట్రిక్ విధానం ద్వారా ఈకేవైసీ వెరిఫికేషన్‌ను పూర్తి చేయాలని సూచించింది.ఈకేవైసీ పూర్తి చేసిన రైతుల ఖాతాల్లో మాత్రమే పీఎం కిసాన్ యోజన పథకం కింద నగదు జమ అవుతుందని పేర్కొంది. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం యేటా ఆరు వేల రూపాయలను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని 3 విడతలుగా రూ.2 వేల చొప్పున అకౌంట్లలోకి వేస్తోంది.
2 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వ పెన్షన్ పథకం లబ్ధిదారులు.. పీఎం కిసాన్ యోజనకు అర్హులు కాదు. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసే వ్యక్తి కూడా ఈ పథకం ప్రయోజనాన్ని పొందలేరు. సొంత భూమి ఉన్న రైతు ఉంటే అది అతని పేరు మీద కాకుండా అతని తండ్రి లేదా తాత పేరు మీద ఉంటే.. అతనికి ఈ పథకం వర్తించదు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించింది.
ఇప్పటివరకు 12 విడతలుగా రైతుల ఖాతాల్లో నగదు జమ అయింది. ప్రస్తుతం ఈ పథకం 13వ విడతకు సంబంధించి అప్‌డేట్ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. మొదటి విడత ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు, రెండవ విడత ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు, మూడవ విడత డబ్బు డిసెంబర్ 1 నుంచి మార్చి 31 మధ్య లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. దీని ప్రకారం వచ్చే నెలలో రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ 13వ విడతకు సబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం ఉంది.
ముఖ్యమైన సూచనలు
- అప్లికేషన్‌ను వెంటనే అప్‌డేట్ చేయండి
- ఈ పథకం కింద మీకు ఏదైనా సమస్య ఎదురైతే త్వరగా పరిష్కరించుకోండి.
- మీరు హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా మెయిల్ చేయడం ద్వారా పరిష్కారాన్ని పొందవచ్చు.
- పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్-155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092ను సంప్రదించవచ్చు. మీరు మీ ఫిర్యాదును
ఇ-మెయిల్ ID (pmkisan-ict@gov.in)లో కూడా మెయిల్ చేయవచ్చు.
Also Read: Bandi Sanjay: మా ఎండింగ్ భయంకరంగా ఉంటుంది.. కేసీఆర్‌కు బండి సంజయ్ వార్నింగ్
Also Read: Rohit Sharma: రోహిత్ శర్మపై వేటు.. బీసీసీఐ మరో సంచలన నిర్ణయం.. ఆ సిరీస్ తరువాత ప్రకటన..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook