Pm Garib Kalyan Yojana: రేషన్ కార్డుదారులకు బ్యాడ్‌న్యూస్. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ఈ నెల 31న ముగుస్తుంది. మరోసారి ఈ పథకాన్ని కేంద్రం పెంచే యోచనలో లేనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 2020లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించగా.. డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద 80 కోట్ల మందికి ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా ఆహార ధాన్యాలు అందుకుంటున్నారు. పథకం కాల వ్యవధి పూర్తయిన తర్వాత.. ఉచిత రేషన్ సౌకర్యం నిలిచిపోనుంది.
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను పథకాన్ని పొడగించే యోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చినా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ పీఎంజీకేఏవై పథకాన్ని గురించి మాట్లాడారు. ప్రభుత్వం ఉచిత రేషన్ పథకానికి కేటాయించిన ఆహార ధాన్యాలను బహిరంగ మార్కెట్లో విక్రయించాలని అన్నారు. ఆర్థిక కార్యకలాపాలు సాధారణంగా ఉన్నప్పుడు పీఎంజీకేఏవై వంటి పథకాన్ని కొనసాగించడం సమర్థనీయం కాదని మీడియాతో ఆయన అన్నారు.
ఆహార ధాన్యాల ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 12.08 శాతం ఉండగా, నవంబర్‌లో 11.55 శాతానికి తగ్గింది. మరోవైపు దేశీయ మార్కెట్లో గోధుమల ధర పెరుగుదల కనిపిస్తోంది. కొత్త పంట వచ్చే వరకు ధర పెరుగుతూనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. డిమాండ్ పెరగడం.. గోధుమ స్టాక్ తగ్గడం వల్ల వాటి ధర నిరంతరం పెరుగుతోంది. దేశీయ మార్కెట్లోనే ఏప్రిల్-మే తర్వాత గోధుమల ధర 50 శాతం వరకు పెరిగింది. గోడౌన్లలో గోధుమల నిల్వ 19 మిలియన్ టన్నులకు పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న కాలంలో ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పీఎంజీకేఏవై పథకాన్ని కొనసాగించడం కేంద్ర ప్రభుత్వానికి సవాలుగా మారింది.
కరోనా ప్రభావం నుంచి పేదలను ఆదుకునేందుకు ఏప్రిల్ 2020లో ఈ పథకాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేస్తోంది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కోసం మొత్తం 3.9 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ఖర్చు అవుతుందని కేంద్రం అంచనా వేసింది. ఈ పథకం కింద ప్రతి నెల 80 కోట్ల మందికి లబ్ధి చేకూరుతోంది. ప్రస్తుతం డిసెంబర్ 31 వరకు ఉచిత రేషన్ అందించి.. ఆ తరువాత నిలిపివేసే అవకాశం కనిపిస్తోంది.
Also Read: Ambati Rambabu: పవన్ కళ్యాణ్‌కు మంత్రి అంబటి సవాల్.. శవాల మీద చిల్లర రాజకీయాలేంటి..?
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. డీఏ పెంపుతోపాటు మరో గుడ్‌న్యూస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook