Petrol Price: ఆల్ టైమ్ హైకు చేరుకున్న పెట్రో, డీజిల్ ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్ టైమ్ హైకు చేరుకున్నాయి. భారీగా పెరుగుతున్న పెట్రో, డీజిల్ ధరలు ఆందోళన కల్గిస్తున్నాయి.

Last Updated : Jan 19, 2021, 01:47 PM IST
Petrol Price: ఆల్ టైమ్ హైకు చేరుకున్న పెట్రో, డీజిల్ ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్ టైమ్ హైకు చేరుకున్నాయి. భారీగా పెరుగుతున్న పెట్రో, డీజిల్ ధరలు ఆందోళన కల్గిస్తున్నాయి.

రోజురోజుకూ పెరుగుతూ పోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ( Petrol, Diesel prices ) సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాయి. చుక్కల్ని తాకుతున్న ఇంధన ధరలు వినియోగదారులకు చెమటలు పట్టిస్తున్నాయి. ఇది చాలదన్నట్టు చమురు కంపెనీ ( Oil Companies ) లు పెట్రో, డీజిల్ ధరల్ని మరోసారి పెంచాయి. జనవరి 19న లీటర్ పెట్రోల్ , డీజిల్ పై మరో 25 పైసలు పెరిగింది. ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీలో లీటల్ పెట్రోల్ 85 రూపాయలకు చేరుకుంది. 

కేవలం వారం రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధర రూపాయికి పైగా పెరగడం గమనార్హం. జనవరి 6 వ తేదీ నుంచి ఇప్పటి వరకూ ఢిల్లీలో పెట్రోల్  ( Delhi Petrol Price ) ధర 1.49 పైసలు పెరగగా..డీజిల్ ధర 1.51 పైసలు పెరిగింది. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ ఇంధన ధరలు ( Oil Prices ) ఆల్ టైమ్ హైకు చేరుకున్నాయి. ముంబై ( Mumbai petrol price ) లో ప్రస్తుతం లీటరు పెట్రోల్ 91 రూపాయల 80 పైసలు కాగా..డీజిల్ రేటు 82 రూపాయల 13 పైసలుగా ఉంది. 

ఇక ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 85 రూపాయల 20 పైసలు కాగా..డీజిల్ ధర 75 రూపాయల 38 పైసలుంది.  చెన్నై ( Chennai petrol price ) లో లీటర్ పెట్రోల్ ధర 87 రూపాయల 85 పైసలైతే..డీజిల్ ధర 80 రూపాయల 67 పైసలుంది.  అటు కోల్ కత్తాలో లీటర్ పెట్రోల్ ధర 86 రూపాయల 63 పైసలు కాగా..డీజిల్ ధర 78 రూపాయల 97 పైసలుంది. హైదరాబాద్ ( Hyderabad petrol price ) లో అయితే లీటర్ పెట్రోల్ 88 రూపాయల 63 పైసలు కాగా..డీజిల్ ధర 82 రూపాయల 26 పైసలుంది. అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల 43 పైసలు కాగా..డీజిల్ ధర 84 రూపాయల 58 పైసలుంది. 

Also read: AP: ఆ పిటీషన్ ఆమోదయోగ్యంగా లేదు: హైకోర్టులో వాదన విన్పించిన ఏజీ శ్రీరామ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News